మరో ఆరు నెలల్లో పంచాయితీ ఎన్నికలు...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మరో ఆరు నెలల్లో పంచాయితీ ఎన్నికలు...!

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలను జరిపి 2014 ఎన్నికల వలే లబ్దిపొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అప్పట్లో జరిగిన స్థానిక ఎన్నికల ప్రభావంతో అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారని చంద్రబాబుకు తెలుసు. తిరిగి అదే సత్తా చాటేందుకు ఎన్నికలు జరిపించేందుకు 'చంద్రబాబు' పరోక్షంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఒకవేళ శాసనసభకు ముందుగా ఎన్నికలు జరిగినా..ఎటువంటినష్టం ఉండదని, ఆ ఎన్నికలోపే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని 'చంద్రబాబు' నిర్ణయించుకున్నారు. అధికారం మనచేతిలో ఉంది..మరొక వైపు ప్రతిపక్షం బలహీనంగా ఉంది. ఈ సమయంలో ఎన్నికలు జరిపితే ప్రతిపక్షాలను మట్టికరిపించవచ్చుననేది 'చంద్రబాబు' ఆలోచన. 2014 ఎన్నికలకు ముందు పరిస్థితివేరుగా ఉండేది..ఇప్పుడు పరిస్థితి అంతా తమకే అనుకూలంగా ఉందని, దీంతో ముందుగా పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తే..పరిస్థితి టిడిపికి అనుకూలంగా మారుతుందని ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అంగీకరిస్తున్నారు. ఎంపిటిసీ,జెడ్‌పిటిసి వ్యవస్థను రద్దు చేయాలని, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కొన్ని రాష్ట్రాలముఖ్యమంత్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ లోపే దీనిపై ఒక నిర్ణయం తీసుకోనుందని, కాబట్టి పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికలపైనే దృష్టిసారించాలని 'చంద్రబాబు' సూచిస్తున్నారు. శాసనసభ,లోక్‌సభ ఎన్నికల గురించి పట్టించుకోవద్దు. మనం కేవలం పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికలపైనే దృష్టిపెడదాం..మెజార్టీ స్థానాలను అవలీలగా గెలవగలుగుతాం..! అని చంద్రబాబు తనను కలిసిన ఎమ్మెల్యేలు,మంత్రులకు చెబుతున్నారు. ఇదే విషయంలో పంచాయితీరాజ్‌శాఖ మంత్రి లోకేష్‌ కూడా తనకు అత్యంత సన్నిహితులైన ఈ ఎన్నికల ప్రస్తావన తెచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పంచాయితీ ఎన్నికలు,మున్సిపల్‌ ఎన్నికలు ముందుగా నిర్వహిస్తే తొంభైశాతం పైగా విజయం సాధించడం ఖాయమన్న ధీమా అధికారపార్టీనాయకులు, ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థలకు మరో ఆరు నెలలు లోగా ఎన్నికలు జరపడం ఖాయమని, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో రాజకీయ వేడి ప్రారంభమైంది. 2014 ఎన్నికల ఫలితాల కన్నా మెరుగైన ఫలితాలు సాధించేందుకు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు కసరత్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ స్థానిక రాజకీయాలు రాబోయే రోజుల్లో రసకందాయకంగా మారబోతున్నాయి.

(311)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ