సచివాలయం క్యాంటీన్‌లో వరుసగా ప్రమాదాలు..! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సచివాలయం క్యాంటీన్‌లో వరుసగా ప్రమాదాలు..!

సచివాలయంలోని ఉద్యోగస్తుల కోపరేటివ్‌ క్యాంటీన్‌లో ఇప్పటికి మూడుసార్లు ప్రమాదం జరిగి మూడు లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగింది. ఎగ్జాటివ్‌ సిస్టమ్‌ క్యాంటీన్‌లో ఫెయిల్‌ నప్పుడు సిఆర్‌డిఎ అధికారులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించలేదనే విమర్శలు వస్తున్నాయి. పోయిన ఎండాకాలంలో ఒకసారి, 45రోజులకు ముందు ఒకసారి, మూడురోజుల కిందట మరోసారి ఈ ప్రమాదం జరిగింది. అక్కడ వంటచేసే హాలులో ఎగ్జాట్‌సిస్టమ్‌ విఫలమై 60 డిగ్రీల వేడి పెరిగిందని దీని వల్ల అక్కడ వండిన పధార్థాలతో పాటు, నిల్వఉన్న వస్తువులు కూడా దెబ్బతిన్నాయని, ఈ విధంగా మూడుసార్లు జరగడం వల్ల సొసైటీకి లక్షల్లో నష్టం వచ్చిందని సభ్యులు చెబుతున్నారు. సొసైటీ నాయకులందరూ తమ ఇబ్బందులను సంబంధిత అధికారులకు తెలియజేసినా ఇంత వరకు ఫలితం లేదు. ఫిర్యాదు చేసినప్పుడు కిందిస్థాయి అధికారులు వస్తున్నారు..పరిశీలిస్తున్నారు..మౌనంగా వెళ్లిపోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన మూడు ప్రమాదాల్లో ఆస్తినష్టం మాత్రమే జరిగిందని, జననష్టం జరిగితే పరిస్థితి ఏమిటని సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు మురళీకృష్ణ సిఆర్‌డిఎ అధికారులను నిలదీశారు. ఏదో మా అదృష్టం బాగుండి..ధననష్టంతోనే సరిపోయింది..అదే జననష్టం జరిగితే..పరిస్థితి ఏమిటని క్యాంటీన్‌ను నిర్వహించే సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే వారందరినీ సేఫ్‌గా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని, వారిని జీవితాంతం ఆదుకునే పరిస్థితి కలగకూడదని, ఆర్థికంగా నష్టం కలిగితే ఏదో విధంగా పూడ్చుకోవచ్చునని, జననష్టం జరిగితే సిఆర్‌డిఎ అధికారులు బాధ్యత వహిస్తారా..? తప్పు ఎవరిదైనా..బలవతుందని..తామేనని కోపరేటివ్‌ సంఘ నాయకులు, సభ్యులు వాపోతున్నారు. వండే పాత్రలు దెబ్బతిన్నాయి..నిల్వ ఉన్న సరుకులు దెబ్బతిన్నాయి..ఇప్పటికి మూడులక్షలకు పైగా నష్టం వచ్చింది. ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డాం. ఇప్పటికైనా దీనికి శాశ్విత పరిష్కారానికి సూచించకపోతే పరిస్థితి ఏమిటని..? ఉద్యోగసంఘ నాయకులు సమావేశంలో వాపోయారు. ఈ విధంగా జరిగిన సంఘటనలను సిఎం దృష్టికి తీసుకెళతానని, సంస్థకు జరిగిన నష్టాన్ని కూడా వివరిస్తానని మురళీకృష్ణ మీడియాతో చెప్పారు. ఎగ్జాస్ట్‌ సిస్టమ్‌ను ఎప్పుడు సరిచేస్తారో..? అప్పటి వరకు మాకు టెన్షన్‌లు తప్పవని, క్యాంటీన్‌ నిర్వహకులు ఆవేదనతో చెబుతున్నారు.  


(323)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ