WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మీ సిఎంకు చదవడం వచ్చా...!?

ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వారసత్వంగా రాజకీయాల్లో చేరిన అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర ప్రజల మనస్సులను చూరగొన్నారు. వరుసగా మూడుసార్లు పార్టీని అధికారంలోకి తెచ్చి..రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఆవిర్భంచారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఆ రాష్ట్ర ప్రజల మాతృభాషను మాత్రం చదవలేరు..సరిగా మాట్లాడలేరు. ఆయన బలహీనతను తెలుసుకుని ఆ రాష్ట్ర ప్రతిపక్షనాయకులు ఆయనను అప్పడప్పుడు ఎగతాళి చేస్తుంటారు. మాతృభాష మాట్లాడలేని ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేస్తుంటారు. కానీ పాపం..ముఖ్యమంత్రేం చేస్తారు...తన పుట్టిన దగ్గర నుంచి విదేశాల్లోనే పెరిగాడు..ఆంగ్రేజీని మాత్రమే నేర్చుకున్నాడు. మాతృభాష మాట్లాడే అవకాశం కాని..నేర్చుకునే అవకాశం కానీ ఆయనకు లభించలేదు. రాజకీయంగా ఎంత బలంగా ఉన్నా మాతృభాష రాని బాధ ఆయనను తొలచివేచింది. అయితే ఆయన సహచరులు ఆయనకో మంచి ఆలోచన చెప్పారు. అదేమిటంటే...ఆయన ఎక్కడైనా మాట్లాడాలనుకున్నప్పుడు...అదీ స్వంత భాషలో మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన చెవిలో ఓ ఇయర్‌ మిషన్‌ ఏర్పాటు చేసి..వెనుక నుంచి స్వంత భాషలో ఏమి మాట్లాడాలో చెబుతుంటారు..ఆయన దాన్ని అందుకుని మాట్లాడుతూ ఉంటారు. 

  కొన్నాళ్లు ఇది బాగానే నడిచింది. అయితే ఎందుకో ఈ మధ్య ముఖ్యమంత్రి వ్యవహారంలో తేడా రావడంతో ప్రతిపక్ష సభ్యులకు అనుమానం వచ్చింది. మాతృభాష రాని మన ముఖ్యమంత్రి ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారనే అనుమానం పెనుభూతమైంది. దీంతో ఆయన బహిరంగంగా ఓ పదిపేజీలు చదవాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ..ఆ ముఖ్యమంత్రి అందుకు మాత్రం అంగీకరించడం లేదట. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరనేగా మీ ప్రశ్న. ఆయనెవరో కాదు..ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌. బిజూ జనతాదళ్‌కు అధ్యక్షుడు అయిన 'నవీన్‌పట్నాక్‌'కు ఇంతకు ముందు ఒరిస్సా అధికారభాష అయిన 'ఒడియా'పై పట్టులేదు. ఒడియాను ఇంగ్లీషులో రాసుకుని ప్రసంగించేవారు. దీన్ని బిజెపి,కాంగ్రెస్‌  పార్టీ నాయకులు ఎద్దేవా చేసేవారు. అందుకే ఈ ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని కనిపెట్టిన ప్రతిపక్షాలు ఆయనకు ఇప్పుడు చదవడంపై ఛాలెంజ్‌ చేస్తున్నాయి. మరి 'నవీన్‌' అందుకు ఒప్పుకుంటారా..? మరో ఏడెనిమిది నెలల్లో అసెంబ్లీఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తోన్న మాతృభాష వ్యవహారం 'నవీన్‌'కు ఇక్కట్లు తెచ్చిపెడతాయా..? చూద్దాం..ఏమి జరుగుతుందో..!?

(348)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ