WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రజల కోసం జైలుకెళ్తా:పవన్‌

ప్రజల కోసం..ఎదురు తిరుగుతా..జనం కోసం జైలుకెళతా..ప్రజల పక్షాన నిలబడడానికి అధికారం అక్కర్లేదు. ముఖ్యమంత్రి పదవి కావాలంటే అధికార అనుభవం కావాలి. కేంద్రానికి ఎదురు తిరిగితే సమస్యలు సృష్టిస్తారని ఎవరో చెబుతున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బందులు వస్తాయని బెదిరిస్తున్నారు..నాకు భయం లేదు...ధైర్యం మాత్రమే ఉంది. దెబ్బతిన్నవారు ఎదురు తిరిగితే ఎలా ఉంటారో తెలుసుకోవాలి. ప్రజల కోసం పాటు పడే వారికోసమే మద్దతు ఇస్తా...! సర్దార్‌గబ్బర్‌సింగ్‌ సినిమా సెన్సార్‌ విషయంలో నన్ను ఇబ్బందులు పెట్టారు. కేంద్ర పెద్దలను కలవాలని కొందరు సలహాలు ఇచ్చారు. కలిసే ప్రసక్తేలేదని చెప్పాను..నేను ఎవరినీ కలవలేదు..గతంలో ఎన్నికల ప్రచారం విశాఖ ఎంపి హరిబాబు, అనకాపల్లి నుండి అవంతీ శ్రీనివాస్‌ను గెలిపించాలని నేనే ప్రచారం చేశాను..ఇప్పుడు డిసిఎను ప్రైవేట్‌పరం చేస్తానంటే అంగీకరించను. ఉద్యోగుల తరుపున పోరాడతాను..ఎంపిలు హరిబాబు, అవంతి శ్రీనివాస్‌లు ఈ సమస్యను పట్టించుకోవడం లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించుకోని నాయకులు, పదవుల్లో ఎక్కువ కాలం ఉండలేరు. ఇప్పటికీ నేను ఏ ఒక్కరికీ భయపడలేదు..నన్ను భయపెట్టినా వెనకడుగు వేయను. రాష్ట్ర విభజన ముందుకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో కేంద్ర పాలకులు విఫలమయ్యారు. ఇప్పటికీ విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి. కేంద్ర పెద్దలు ఇప్పటికైనా విభజన హామీలను అమలు చేయాలి. చేయకుంటే..ఓటు వేసిన ప్రజలే ఎదురు తిరుగుతారు. ప్రత్యక్ష రాజకీయాలకు ఎక్కువ సమయం ముందు ముందు కేటాయిస్తాను. ప్రజా సమస్యల కోసం ఎవరితోనైనా పోరాడతాను తప్ప వెనకడుగు వేయను. ఆయన ప్రసంగంలో ప్రధాని మోడీని, పరోక్షంగా వై.ఎస్‌ జగన్‌పై దాడే ఎక్కువగా కనిపిస్తోంది. ఒకరు ఓటర్లును మోసం చేశారు..మరొకరు అధికార దాహంతో వ్యవహరిస్తున్నారనే ఆయన ప్రసంగించడం జరిగింది. ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఆ సంస్థను ప్రైవేటీకరిస్తే సహించమన్నారు. 

  ఇప్పటికీ కేంద్రం తగిన చర్యలు తీసుకోకుండా ఉంటే..తాను వ్యతిరేకంగా పోరాడతానని ఆ సమావేశానికి హాజరైన కార్మికులకు ఆయన హామీ ఇచ్చారు. సంస్థ లాభాలబాటలో ఉన్నా..గత అప్పులను బూచిగా చూపించి ప్రైవేట్‌ పరం చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. సమస్యలు పరిష్కరించాలని ప్రైవేటీకరణ చేయటం తగదని అన్నారు. సంస్థను కాపాడుకోవడానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి...ఎవరైనా సమస్యలు పరిష్కరించకపోయినా ఇదే విధంగా నిలదీస్తా...ఇప్పటికీ ఈ సంస్థను ప్రైవేటీకరించవద్దని ప్రధానికి లేఖ రాయటం జరిగింది. ఈ సంస్థను ప్రైవేటీకరిస్తే..ఇక్కడ నుంచే బిజెపి పతనం ఖాయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత మరిచిపోకుండా సంస్థను కాపాడడానికి ప్రయత్నించాలి. ఏది ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేయవచ్చు..ఇంత వరకు ఎటువంటి తప్పులు చేయలేదు. ప్రజలకు నష్టం చేకూర్చే ఏ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తేలేదు. రాజకీయనాయకులకు జవాబుదారీగా ఉండాలి. అధికారం విలువ, బాధ్యత నాకు తెలుసు. నాకు అధికార దాహం లేదు. సమస్యలపై పోరడడానికి అధికారం అవసరం లేదు. ఎక్కడ ప్రజలను ఇబ్బందులు పెడితే అక్కడ నేను ప్రత్యక్షమవుతాను. స్వంత పనుల కోసం ఎవరినీ కలవలేదు. భవిష్యత్‌లో కలిసే ప్రసక్తేలేదు. ముందడుగు వేయటమే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తేలేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన నిర్వహించిన సమావేశంలో 'మోడీ'తో ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అధికారంతోనే సమస్యలు పరిష్కరించవచ్చన్న వైకాపా అధినేత 'జగన్‌'ను ఆయన పరోక్షంగా తప్పుపట్టారు. విశాఖ,అనకాపల్లి ఎంపిలను దయ్యబట్టారు తప్ప 'చంద్రబాబు'పై పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ ఒక్క విమర్శ కూడా చేయలేదు. దీనిని బట్టి ఆయన భవిష్యత్‌ వైఖరి ఏమిటో త్వరలో వెల్లడి కానుంది. ఇక ముందు 'జనసేన' పార్టీ కార్యక్రమాలను ఉదృతం చేసేందుకు ఆయన సిద్ధం అవుతున్నారు.


(295)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ