WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గ్రీవెన్స్‌ పరిష్కారంలో 'కృష్ణా' నెం.1

కృష్ణా జిల్లా అధికారగణం మరోసారి సత్తా చాటారు. గ్రీవెన్స్‌ సెల్స్‌కు వచ్చే సమస్యలను పరిష్కరించడంలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి కనెక్ట్‌ మరియు పరిష్కార వేదికకు మొత్తం 1048 కేసులు రాగా వాటిలో 984 కేసులను పరిష్కరించి మొత్త 93శాతంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోని 13జిల్లాల్లో మొదటి స్థానాన్ని సాధించింది. ప్రభుత్వ విధించిన పారామీటర్స్‌ను అందుకోవడంలో కృష్ణా జిల్లా యంత్రాంగం సఫలమైంది. కృష్ణా తరువాత పశ్చిమగోదావరి, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలు తరువాత స్థానాల్లో నిలిచాయి. ఇవి వరుసగా 89.55%,81.62%,81.49%శాతాలను సాధించాయి. 80.07శాతంతో తూర్పుగోదావరి, 77.75శాతంతో గుంటూరు, 77.10శాతంతో విజయనగరం జిల్లాలు తరువాత స్థానాలు సాధించగా, కర్నూలు 76.16, అనంతపురం 74.85శాతం,నెల్లూరు 70.90శాతం, చిత్తూరు 67.93శాతం, శ్రీకాకుళం 58.37శాతం, కడప జిల్లా 52.24 స్థానంతో చివరి స్థానాన్ని పొందాయి. 21,422 గ్రీవెన్స్‌ ధరఖాస్తులను పరిష్కరించి 79.64శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానాన్ని ఎగురేసుకుపోయింది. కాగా శ్రీకాకుళం జిల్లా పరిష్కారవేదికలో 4,394 ధరఖాస్తులను పరిష్కరించి 51.60శాతంతో 13వ స్థానం పొందింది. ప్రింట్‌ మీడియాలో వచ్చిన 831 సమస్యల్లో 684 సమస్యలను పరిష్కరించి కృష్ణా మొదటి స్థానంలో నిలిచింది. అదే విధంగా ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చిన 61 సమస్యల్లో 46 సమస్యలను పరిష్కరించింది. ఎఎంఎస్‌లో 81.84 శాతంతో కృష్ణా మొదటి స్థానంలో నిలవగా 27.54శాతంతో కడప ఆఖరి స్థానాన్ని పొందింది. గ్రీవెన్స్‌కు జిల్లామొత్తం మీద 2,26,658 ధరఖాస్తులు రాగా వాటిలో 1.09,175 ధరఖాస్తులను కృష్ణా జిల్లా యంత్రాంగం పరిష్కరించింది. ఇది మొత్తంలో 86.88 శాతం. నెల్లూరు జిల్లాలో మొత్తం 2,06,734 ధరఖాస్తులు రాగా వీటిలో కేవలం 52,952 ధరఖాస్తులను మాత్రమే పరిష్కరించారు. సోషల్‌ మీడియా లేవనెత్తిన సమస్యల పరిష్కారంలో కూడా కృష్ణా జిల్లా మొదటిస్థానం సాధించింది. ఈవిషయంలో చిత్తూరు జిల్లా ఆఖరుస్థానంలో ఉంది. మొత్తం మీద జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆయన స్వయంగా పనిచేస్తూ..తన సిబ్బందితోనూ పనిచేయిస్తూ జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్నారు. మిగతా జిల్లాల కన్నా అభివృద్ధిలో,సంక్షేమంలో కృష్ణాను టాప్‌గా నిలపాలన్న ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నారు.


(157)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ