WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సంపాద‌న‌ప‌రులుగా విభిన్న ప్ర‌తిభావంతులు

* వారికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నాం

* ప్ర‌తిభావంతుల కోసం ఏపీలో తొలిసారిగా చేయూత కార్య‌క్ర‌మం రూప‌క‌ల్ప‌న అమ‌లుకు క‌స‌ర‌త్తు

* కృష్ణా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: కృష్ణా జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ప్రతి నెలా రూ.10 వేలు కుటుంబ ఆదాయం సమకూర్చుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతం తెలిపారు. విజ‌య‌వాడ‌లోని త‌మ విడిది కార్యాలయు సమావేశ మందిరంలో శుక్రవారం డిఆర్డీఏ,  డిజాబుల్, వైద్యాధికారులు, విభిన్న ప్రతిభావంతుల సంఘ సభ్యులతో కలెక్టరు బి.లక్ష్మీకాంతం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు ల‌క్ష్మీకాంతం మాట్లాడుతూ జిల్లాలో లక్షా 35 వేల వరకు విభిన్న ప్రతిభావంతులు ఉన్నారని వారి కుటుంబ పోషణకు నెలకు పదివేల రూపాయలు ఆదాయం సమకూర్చుకొనే విధంగా స్వయం ఉపాధిని కల్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా విభిన్న ప్రతిభావంతుల కోసం  చేయూత కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు కలెక్టరు చెప్పారు. ఈ క్ర‌మంలో జిల్లాలోని వివిధ కేటగిరిలకు సంబందించిన‌ దివ్యాంగులు పూర్తి వివరాలను గ్రామ‌, మండల స్థాయిలో స్వయం సహాయు సంఘాల ద్వారా సేకరించి వివరాలను కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేయాల‌ని కలెక్టరు డిఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజాను ఆదేశించారు. ఈ ప్రక్రియు ఇప్పటి నుండి ప్రారంభించి 2018 డిసెంబరు నాటికి పూర్తి చేయాల‌ని తెలిపారు. కేటగిరి వారీగా జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల డేటా ప్రక్రియను పరిశీలించి ప్రేయారిటీ ప్రకారం అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పేరేషన్ల ద్వారా బ్యాంకర్ల ఆర్థిక సహాయంతో స్వయం ఉపాధికి యూనిట్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. దివ్యాంగులకు సదరన్ సర్టిఫికేట్స్ జారీ చేయడంలో సైతం జాప్యం లేకుండా వైద్యాధికారులు సహకరించాలని సూచించారు. స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకొన్న విభిన్న ప్రతిభావంతులకు బ్యాంకర్లు రుణ సౌకర్యం కల్పించాలని ఎల్డీయంకు సూచించారు. అలాగే జిల్లాలో అంగవైకల్యం ఉన్న చిన్నారులు అంద‌రికీ ఉప‌కార వేత‌నాలు అందజేయాల‌ని, అర్హులై ఉండి పెండింగ్‌లో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఇళ్ళ పట్టాలు, గృహాలు మంజూరు చేయాల‌ని గృహనిర్మాణ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. మానసిక వికలాంగులకు వయస్సుతో ప్రమేయం లేకుండా వైద్యాధికారులు పరీక్షల అనంతరం సర్టిఫికేట్‌ను జారీ చేయాల‌న్నారు. పరీక్షల‌న్నీ నిర్ధారణ అనంత‌రం విభిన్న ప్రతిభావంతులకు సదరన్ సర్టిఫికేట్లు మంజూరులోనూ జాప్యం లేకుండా సంబందిత అధికారులు శ్రద్ద తీసుకోవాలని తెలిపారు. పదవ తరగతి పరీక్షలకు హాజరైయ్యే చెవిటి, మూగ విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయుల‌ను నియమించాలని డిఇవోకు సూచించారు. సమావేశానికి హాజరైన వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగుల కొరకు వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాల‌ని, దివ్యాంగులకు వివాహ సమయంలో అందించే ఆర్థిక సహాయం లక్ష రూపాయల‌ను అదే సమయంలో అందించాలని, అపరాలు, కూరగాయలు, పండ్లు వ్యాపారం నిమిత్తం ట్రై సైకిళ్ళను మంజూరు చేయాల‌ని,  హెల్త్ కార్డులు మంజూరు చేయాల‌ని కలెక్టరుకు విజ్ఞ‌ప్తి చేశారు. విభిన్న ప్రతిభావంతులకు హెల్త్ స్కీము క్రింద కేంద్రం  హెల్త్ పాలసీ విధానాన్ని చేయూత స్వచ్చంధ సంస్థ ప్రతినిధి డాక్ట‌ర్ కృష్ణకుమారి వివరించారు. సమావేశంలో డిజెబుల్డ్ ఏడీ ఏవీడీ నారాయణరావు, చైతన్య వికలాంగుల సేవా సంస్థ ప్రతినిధి కె.యం.కుట్టి, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

(287)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ