WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

లలిత జూలరీలో దొంగతనం

హైదరాబాద్: పంజాగుట్టలోని లలితా జ్యూవెలరీ షాపులో చోరీ జరిగింది. బురఖా ధరించి వచ్చిన ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ. 6 లక్షల విలువైన హారాన్ని దొంగిలించి... దాని స్థానంలో రోల్డ్ గోల్డ్ హారం ఉంచి పరారయ్యారు. ఈ తతంగం అంతా షాపులోని సీసీ కెమెరాలో రికార్డైంది. తాజాగా సీసీ ఫుటేజీ పరిశీలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో షాపు అధికారులు పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగతనానికి గురైన హారంతో ఇదివరకే సదరు మహిళలు సెల్ఫీ తీసుకొని వెళ్లి, ఫోటోలో ఉన్న ఆభరణం లాగే రోల్డ్ గోల్డ్ నగను తయారు చేయించారు. ఆ నకిలీ నగతో మళ్లీ లలితా జ్యూవెల్లర్స్‌కి వచ్చి.. సెల్ఫీ తీసుకుంటున్నట్లుగా నటించి ఒరిజినల్‌తో ఉడాయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

(524)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ