WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

భద్రతా ప్రమాణాలు పాటించని గనులను మూసివేస్తాం

 విజయనగరం: బొబ్బిలి మండలం బంకురువలస లో ప్రమాదం జరిగిన మాంగనీస్ గని ప్రాంతాన్ని రాష్ట్ర గనుల శాఖ మంత్రి ఆర్.వి.సుజయ్ కృష్ణ రంగారావు, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ లు సందర్శించారు., ప్రమాదం లో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి, చంద్రన్న బీమా, కార్మిక చట్టం ప్రకారం యాజమాన్యం ద్వారా మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకుంటామని మంత్రి తెలిపారు.  ఈ గని ప్రమాదంపై విచారణ జరిపిస్తామని, ఈ సంస్థ గని తవ్వకాలు సందర్భంగా నిర్ణీత భద్రతా ప్రమాణాలు పాటించినదీ లేనిది విచారణ లో నిర్ధారణ అవుతుందని, భద్రతా చర్యలు పాటించడం లేదని నిర్ధారణ జరిగితే ఈ గనిని శాశ్వతంగా ముసివేయిస్తా మన్నారు. గనులలో భద్రతా ప్రమాణాలకు సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశాన్ని ఈనెల 14న అమరావతి లో నిర్వహించి గనుల్లో భద్రతపై చర్చిస్తామన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని మైనింగ్ సంస్థలపై చేపట్టాల్సిన చర్యలను కూడా ఈ సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. బొబ్బిలి ప్రమాదంలో ఇరువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అని మంత్రి పేర్కొన్నారు.

(185)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ