WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గంజాయి అక్ర‌మ ర‌వాణాను అరిక‌డతాం: హోంమంత్రి చిన‌రాజ‌ప్ప‌

గంజాయ్ అక్రమ రవాణా ను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపడతామ‌ని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. మంగ‌ళ‌వారం నాడు ఆయ‌న గుంటూరులో మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయ్ అక్రమ రవాణా పెరిగిపోయింద‌ని,నేరస్థులు పోలీసులకు దీటుగా టెక్నాలజీ ఉపయోగిస్తున్నార‌ని, దీన్ని అర‌క‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు పోలీసుల స్పందన అభినందనీయంగా ఉంద‌ని,రాష్ట్రంలో ఇసుక మాఫియాను అరికట్టడంలో విజయం సాధించామ‌న్నారు. ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలో ఎదురైన కుల వర్గ విభేదాలను అడుపుచేయగలిగామ‌ని,  రౌడీయిజం చేస్తే ఉపేక్షించమ‌ని హెచ్చ‌రించారు. గతంలో కబ్జా చేసిన రైతుల భూములను తిరిగి రైతులకు అప్పగించామ‌ని,పోలీసు శాఖ ఎప్పుడు పేదల పక్షాన ఉంటుంద‌న్నారు.పేదల సమస్యలు తీర్చడమే పోలీస్ ధ్యేయమ‌ని, అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామ‌ని తెలిపారు.రాష్ట్రంలో భూతంగా మారిన క్రికెట్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపుతామ‌ని,బెట్టింగ్ లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని రాజ‌ప్ప తెలిపారు.

   విద్యార్థుల ఆత్మహత్యల పై కాలేజ్ యాజమాన్యాలతో చర్చించాల‌ని, రాష్ట్రం విడిపోయిన తరువాత రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది కొరత ఏర్పడింద‌ని, అయినప్పటికీ విధినిర్వహణలో పోలీసుల పాత్ర అభినందనీయంగా ఉంద‌న్నారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోయాయ‌ని,ఎప్పటికప్పుడు సైబర్ క్రైమ్ పై ప్రజలలో అవగాహన కల్పించడంతో పాటు,నేరాలను నియంత్రించేందుకు కృషి చేస్తామ‌ని చెప్పారు.రోడ్ ప్రమాదాల పై ప్రత్యేక దృష్టి సారించామ‌ని,వాహనాలు నడిపేటపుడు డ్రైవర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల‌ని, ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడుపకూడద‌ని,మద్యం తాగి వాహనాలు నడిపే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు.రాష్రంలో మహిళ పై జరుగుతున్న దాడుల ను ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటుందని, మహిళలపై దాడులకు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని,రాష్ట్రంలో శాంతి భద్రతలు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమ‌న్నారు.ఆయన ఆశయసాధన దిశగా అందరూ కష్టపడి పనిచేయాలని,పోలీస్ ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బంది విధి నిర్వహణ పై దృష్టి సారించాలని, దొంగల నుండి రికవరీ చేసిన సొమ్మును పారదర్శకంగా సొమ్ము పోగొట్టుకున్న వారికి అప్పగించాలన్నారు.నూతనంగా పోలీస్ ట్రైనింగ్ లో ఉన్న సిబ్బందికి టెక్నాలజీ అదేవిధంగా నిజాయితీగా విధులు నిర్వహించేలా శిక్షణలో నేర్పిస్తామ‌ని చిన‌రాజ‌ప్ప తెలిపారు.

(303)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ