WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాష్ట్ర సమాచార హక్కు చీఫ్‌ కమీషనర్‌గా 'నండూరి'...!

రాష్ట్ర సమాచార హక్కు ప్రధాన కమీషనర్‌గా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ 'నండూరి సాంబశివరావు' ఎంపిక కానున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న 'నండూరి' సర్వీసు ఈ మాసాంతానికి పూర్తికానుంది. దీంతో ఆయనను సమాచారహక్కు ప్రధాన కమీషనర్‌గా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ఆయనను మరో రెండేళ్లపాటు డీజీపీగా కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత ప్రయత్నించినా...కేంద్ర ప్రభుత్వం అడ్డు తగలడంతో..ఇటీవలే ఆయనను శాశ్విత డీజీపీగా నియమించారు. దీంతో ఆయనకు డీజీపీగా పొడిగింపు సాధ్యం కాదు. అయితే తాను ఎంత ప్రయత్నించినా..కేంద్రం ఒప్పుకోకపోవడంతో..ఆయనను సమాచారహక్కు ప్రధాన కమీషనర్‌గా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం నాడు రాష్ట్ర సమాచారహక్కు కమీషనర్ల ఎంపిక కోసం  కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనాల్సిన ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి హాజరు కాకపోవడంతో..సమావేశాన్నివాయిదా వేశారు. 'జగన్‌'కు మరో అవకాశం ఇస్తూ...కమిటీ సమావేశాన్ని వాయిదా వేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి, ప్రతిపక్షనేత కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరు సమాచారహక్కు చీఫ్‌ కమీషనర్‌ను,మరో ముగ్గురు కమీషనర్లను ఎంపిక చేస్తారు. ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఉన్నందున ఆయన మరో సమావేశానికి కూడా హాజరు అయ్యే అవకాశాలు లేవు. దీంతో ఈ నెలాఖరుకు కమిటీ సమావేశమై వచ్చిన పేర్లను పరిశీలించి తుది పేర్లను ఎంపిక చేస్తుంది.

    ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'నండూరి'ని డీజీపీగా కొనసాగించాలని భావించినా కేంద్రం అడ్డుపుల్ల వేయడంతో..ఆయనకు ఈ పదవి ఇచ్చి న్యాయం చేయాలనే భావనతో ఉన్నారని అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 'కాపు'లకు తమ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో..డీజీపీ ఎంపికపై కేంద్రంతో పోరాడి రుజువు చేసిన 'చంద్రబాబు' ఇప్పుడు 'నండూరి'కి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పదవి ఇచ్చి..మరోసారి రుజువు చేసుకోవాలని భావిస్తోంది. 'నండూరి'ని చీఫ్‌ కమీషనర్‌గా నియమించి..మరో ముగ్గురు కమీషనర్లను ఇతర సామాజికవర్గాల నుంచి ఎంపిక చేస్తారని తెలుస్తోంది. వీరిలో ఒకరు మహిళ ఉంటారని కూడా ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఈ పదవుల కోసం దాదాపు 300 మంది ధరఖాస్తులు చేసుకున్నారని, వీటిలో 30 ధరఖాస్తులను ఫైనల్‌ జాబితాలోకి చేర్చారని తెలుస్తోంది. పైన చెప్పిన 30మందిలో నలుగురిని ఎంపిక చేస్తారని, డిసెంబర్‌ మాసాంతంలో ఈ ఎంపికలు ఉంటాయని ఆ వర్గాలు చెప్పాయి. ఏది ఏమైనా..తనను నమ్ముకున్నవారికి న్యాయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతవరకైనా వెళతారనే విషయం 'నండూరి' ద్వారా మరోసారి లోకానికి వెల్లడైంది.

(1739)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ