WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆ ముగ్గురు మంత్రులు ప్రలోభాలకు గురయ్యారా...!?

డిఇఒల బదిలీలు, పోస్టింగ్‌ల్లో తమ సిఫార్సులకు విలువ ఇవ్వకుండా ఏకపక్షంగా వారిని నియమించడంపై ముగ్గురు మంత్రులు అభ్యంతరాలు, ఆగ్రహం  ఆ శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావుపై వ్యక్తం చేసినా...చివరకు మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనం మరియు సరిపెట్టుకోవడం వెనుక ఆ మూడు జిల్లాల డిఇఒలు ఆ ముగ్గురు మంత్రులను స్వయంగా కలిశారు. నచ్చచెప్పారా..? ప్రాధేయపడ్డారా..? మరో రకంగా వ్యవహరించారా..? అనే విషయంపై పలు రకాలైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బదిలీలు ఉత్తర్వులు తమ సిఫార్సులకు భిన్నంగా వెలువడడంతో ఆ ముగ్గురు మంత్రులు..తమ జిల్లాల కలెక్టర్లకు ఫోన్‌చేసి ఆ డిఇఒలను చేర్చుకోవద్దని చెప్పడం జరిగింది. దీంతో వారు బాధ్యతలను స్వీకరించడానికి ఆయా జిల్లాల కలెక్టర్లు అనుమతించలేదు. ఇంతలో ఏమి జరిగిందో ఏమో కానీ...ఆయా మంత్రులను డిఇఒలను కలసి పుష్పగుచ్చాలను ఇచ్చినట్లు జిల్లా పత్రికల్లో ఫొటోలు కనిపించాయి. 

  ఇదేమిటయ్యా...నిన్న వద్దన్నారు...ఈరోజు నవ్వుతూ ఫోటోలు దిగారు..ఇంతలో ఏమేమి మార్పులు..చేర్పులు జరిగాయి..ఆవేశాలు..ఆగ్రహాలు చల్లారాయా..? లేక మరో విధంగా మంత్రులను వారు ప్రసన్నం చేసుకున్నారా..? అనే విషయంపై ఆ మూడు జిల్లాలోని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు జిల్లాల డిఇఒల పోస్టింగ్‌లపై అభ్యంతరాలు వ్యక్తం చేసి వారిని విధుల్లో చేరకుండా చేసిన మంత్రులు పుల్లారావు, అచ్చెంనాయుడు, శిద్దారాఘవరావులు చివరకు ఎందుకు వారిని చేర్చుకున్నారనే విషయంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై సిఎంఒ అధికారులు వత్తిడి తెచ్చారా..? లేక మంత్రి గంటా ఆ ముగ్గురు మంత్రులకు నచ్చ చెప్పారా..? లేక మరో విధంగా మంత్రులు అంగీకరించారా..? అనే విషయం బయటకు రావడం లేదు. చివరకు మీడియా వర్గాలకు కూడా ఈ విషయం అంతుబట్టలేదంటే..ఆ డిఇఒలకు, మంత్రులకు మధ్య జరిగిన ముఖాముఖి సంబాషణ బయటకు రాలేదు. ఆ ముగ్గురు డిఇఒలు..మా మంత్రులను స్వయంగా కలసి ఏకాంతంగా మాట్లాడారు...లోపల ఏమి జరిగిందో తమకు తెలియదు..ఆ మర్నాడే..విధుల్లో చేరిపోయారు...అని ఆయా మంత్రుల సిబ్బంది చెబుతున్నారు. అసలేం జరిగిందనే విషయం మరి కొద్దిరోజుల్లో బయటపడదు.

(340)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ