లేటెస్ట్

రోజ్‌గార్‌ మేళాను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

గౌరవనీయులైన సంస్కృతి, పర్యాటకం మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి, శ్రీ జి. కిషన్ రెడ్డి,   ఈరోజు అనగా తేదీ 22   అక్టోబర్ 2022న రైల్ కళా రంగ్ , భోయిగూడ, సికింద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాజ్య సభ సభ్యులు  డాక్టర్ కె. లక్ష్మణ్,  కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్   సమక్షంలో కేంద్ర ప్రభుత్వం  చేపట్టిన  రోజ్‌గార్ మేళా  ద్వారా మొదటి దశలో ఎంపికైన  అభ్యర్థులకు నియామక పత్రాలను     అందజేశారు.   ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే  జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌ ​​డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ శ్రీ ఎకె గుప్తా, వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జాతీయ స్థాయిలో 10 లక్షల మంది సిబ్బంది కోసం రోజ్‌గార్ మేళా - రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించారు. నూతనంగా  నియమితులైన ఉద్యోగార్థులకు   గౌరవనీయులైన ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. కొత్తగా  నియామకం పొందిన  ఉద్యోగార్థులు  దేశ నిర్మాణంలో యువత కీలకపాత్ర పోషిస్తుందని, కొత్త భారతావనిని నిర్మించడంలో తమవంతు కృషిని, నిజాయితీగా, అత్యంత అంకితభావంతో తమ విధులను నిర్వర్తించేలా    ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు.


ఈ సందర్భంగా శ్రీ జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఎంపికైన ఉద్యోగార్థులకు అభినందనలు తెలుపుతూ, వారి జీవితంలో ఇది ఒక కొత్త అధ్యాయానికి   నాంది పలకడం పట్ల అయన వారికి   శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని యువతకు  మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించినందుకు గౌరవప్రదమైన ప్రధానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ మిషన్, పునరుజ్జీవనం మరియు పట్టణ పరివర్తన కోసం అటల్ మిషన్, అందరికీ గృహనిర్మాణం వంటి ప్రతిష్టాత్మకమయిన  కార్యక్రమాలతో  సహా వివిధ రంగాలలో మరిన్ని ఉపాధి అవకాశాలను మరియు పెట్టుబడులను ఆకర్షించడానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలను చేపడుతోందని ఆయన తెలియజేశారు. మౌలిక సదుపాయాల  కల్పన  అభివృద్ధి మరియు పారిశ్రామిక కారిడార్లు. ఏర్పాటు చేయడం వంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం స్థానిక ఉత్పత్తులు మరియు సేవలను ప్రోత్సహించేందుకు గాను "మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని కూడా చేపట్టిందని ఆయన చెప్పారు.ఈ  కార్యక్రమం వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టడం , విక్రాంత్ వంటి యుద్ధనౌకల తయారీని దేశీయంగా ప్రోత్సహిస్తోందని ఆయన చెప్పారు.

 గౌరవనీయులైన కేంద్ర మంత్రి మాట్లాడుతూ ..  తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులకు  అభివృద్ధికి గాను కేంద్రం రూ 1,20,000 కోట్లు కేటాయించారని తెలిపారు . అంతేకాకుండా, రూ.650 కోట్లతో  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను   ఆధునీకరించుటకు/పునరాభివృద్దికోసం  గాను  రైల్వే  శాఖా చర్యలు  చేపట్టిందన్నారు . అలాగే కా చర్లపల్లి రైల్వే శాటిలైట్ టెర్మినల్ పనులు కూడా పురోగతిలో ఉన్నాయని తెలిపారు.  ఈ నియామక ప్రక్రియ పూర్తిగా  పారదర్శకంగా మరియు ప్రతిభ ఆధారంగా ఉంటుందని కూడా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా, రక్షణ, పోలీసు మరియు బి .ఎస్ ఎఫ్ మొదలైన వివిధ రంగాలలో కూడా మహిళా సాధికారత గొప్ప పురోగతిని సాధించిందని ఆయన అన్నారు. దక్షిణ మధ్య రైల్వే  జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జ్) శ్రీ అరుణ్ కుమార్ జైన్ తన స్వాగత ప్రసంగంలో మాట్లాడుతూ, జాతి పునర్నిర్మాణంలో యువతకు ఉపాధి అవకాశాలు  కొత్త ఆవిర్భావానికి నాంది పలికే ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని జోన్‌లో నిర్వహించడం ఎంతో  సంతోషకరమైన క్షణమని అభివర్ణించారు .  గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి  శక్తివంతమైన /క్రీయాశీలకమయిన  నాయకత్వంలో, భారతీయ రైల్వేలు పరివర్తన దశలో ఉన్నాయని మరియు రైల్వే    ప్రగతి చక్రాలు సహితం  దేశం యొక్క ఆర్థిక వృద్ధిలో   చేయితనందిస్తుందని  ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కనిపిస్తున్న వృద్ధిపథం   భవిష్యత్తు కాలంలో కూడా మరింతగా  విస్తరించడం ఖాయమని ఆయన స్పష్టం చేసారు .

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ