WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

‘అజ్ఞాతవాసి’ టీజర్ విడుదల‌...!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను శనివారం సాయంత్రం విడుదల చేశారు. పవన్‌ ఇందులో చాలా స్టైలిష్‌గా కనిపించారు. ఇక టీజర్ విషయానికి వస్తే..‘‘మధురాపురి సదనా.. మృదు వదన... మధుసూదన’’ (అత్తారింటికి దారేది చిత్రంలోని ‘దేవ దేవం భజే’ సాంగ్ తరహాలో) బ్యాగ్రౌండ్ సాంగ్‌తో మొదలైన టీజర్ అడుగడుగునా అత్తారింటికి దారేది సినిమాని తలపిస్తూ నడిచింది. వారణాసి సీన్‌తో మొదలై, యాక్షన్ ఎపిసోడ్, చుట్టూ గ్యాంగ్, ఇంట్లో కామెడీ, వారణాసి సాధువులతో నడుస్తూ అనేక యాంగిల్స్‌లో పవన్ దర్శనమిచ్చారు. భారీ తారాగణం ఉన్నట్లుగా ఒక్కో పాత్రని చూపించిన ఈ టీజర్‌లో కీర్తిసురేష్, అను ఇమ్మానుయేల్‌ల పాత్రలు కూడా రివీల్ చేశారు. పవన్ కల్యాన్ చేస్తున్న కొన్ని చర్యలను చూసి.. వీడి చర్యలు ఊహాతీతం వర్మ.. అని మురళీశర్మ అంటే థట్స్ బ్యూటీ అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ ఒక్కటి మాత్రమే ఈ టీజర్‌లో పొందుపరిచారు. ఇక ఈ టీజర్‌లో పవన్ మాట్లాడిన డైలాగ్ ఏదైనా ఉంది అంటే అది ‘ఓ మై గాడ్’ మాత్రమే. ఓవరాల్‌గా టీజర్ అంతా అత్తారింటికి దారేదిని తలపిస్తున్నా.. మధ్యలో ఖుష్బూ కనిపించడం, పవన్ బ్యాగ్ పట్టుకుని నడిచి వెళ్లిపోతుండడం చూస్తుంటే మాత్రం ఈ ‘అజ్ఞాతవాసి’ వేరు అని అనిపిస్తుంది.



(226)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ