WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రాజ్యసభ' సీటు ఇవ్వకపోతే...పార్టీకి గుడ్‌బై:నన్నపునేని

రాజ్యసభ సీటు అడుగుతాను...ఇస్తారన్న నమ్మకం నాకు ఉంది...ఇవ్వకుంటే..ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం అడుగుతాను..అదీ ఇవ్వకుంటే..నా దారి నేను చూసుకుంటాను..అని మహిళా కమీషన్‌ ఛైర్మన్‌ 'నన్నపునేని రాజకుమారి' ఒక టీవీ ఛానెల్‌తో వ్యాఖ్యానించడం జరిగింది. రాజ్యసభ సీటును ఏ అర్హతతో అడుగుతున్నారన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ..'తాను తెలుగులో చక్కగా మాట్లాడతాను..ఉపన్యాసాలు కూడా చక్కగా చెబుతాను..' ఇంగ్లీషు, హిందీ రావాలని నిబంధన ఉందా..? ప్రస్తుత రాజ్యసభ సభ్యుల్లో హిందీ, ఇంగ్లీషు రాని వారు లేరా..? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. మీకు రాజ్యసభ సీటు రాకుంటే...పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా..ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 'చంద్రబాబు'ను కోరతాను..అప్పటికీ ఆయన అవకాశం ఇవ్వకపోతే...ఆ నాటికి ఆమ్‌ఆద్మీ వలే వేరే పార్టీ స్థాపించవచ్చు కదా...? అప్పటి పరిస్థితులను బట్టి ...ఆ పార్టీలో చేరి పోటీ చేస్తానేమో..అని నర్మగర్భంగా చెప్పారు..నన్నపనేని.

  మహిళా కమీషన్‌ ఛైర్మన్‌ పదవిలో నియమించాలంటే...కనీసం డిగ్రీ అర్హత అయినా ఉండాలి...అయినా అభిమానంతో 'చంద్రబాబు' ఆ పదవిని 'రాజకుమారి'కి ఇచ్చారు. మాములుగా అయితే కమీషన్‌కు ఛైర్మన్‌ను నియమించేటప్పుడు న్యాయశాస్త్రంలో పట్టాను పరిగణలోకి తీసుకుంటారు. ఆరవ తరగతి కూడా చదవని రాజకుమారిని మహిళా...కమీషన్‌ ఛైర్మన్‌నుగా 'నన్నపునేని' నియమించారంటే..ఆమెపై ఎంత అభిమానం ఉంటే..'చంద్రబాబు' ఆమెకు పదవి ఇచ్చారో అర్థం అవుతుంది. ఇంతకు ముందు ఆమెకు ఎమ్మెల్సీ పదవిని కూడా ఇచ్చారు...ఆమె కుమార్తె 'నన్నపునేని సుధ' వినుకొండ నుంచి వైకాపా తరుపున పోటీ చేసినప్పుడు..ఆ ప్రాంతంలో ఆమెకు ఉన్న పరిచయం ఉన్న వారికి, టిడిపి కార్యకర్తలకు, నాయకులకు మద్దతు ఇవ్వాలని కోరారు. 1989లో ఆమె వినుకొండ నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే అయిన ఆమెకు చీఫ్‌విప్‌ పదవి దక్కింది. అప్పట్లో ఆమె చీఫ్‌విప్‌గా దివంగత ఎన్టీఆర్‌ను తీవ్రమైన,అభ్యంతరకరమైన భాషలో దూషించిన సంగతి టిడిపి అభిమానులు ఇంకా మరిచిపోలేదు. గతంలో ఎన్నెన్ని విమర్శలు చేసినా...పార్టీలోకి ఆమెను తీసుకుని మహిళా అధ్యక్ష పదవితో పాటు, ఎమ్మెల్సీ పదవి ఆ తరువాత మహిళా కమీషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చినా..'నన్నపునేని'కి ఇంకా తృప్తి కలగడం లేదు. రాజ్యసభ సీటు ఇవ్వకపోతే...ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలి...అప్పుడు కూడా అవకాశం ఇవ్వకపోతే...ఇంకొక పార్టీ నుంచి పోటీ చేస్తానని..మీడియా వర్గాలతో వ్యాఖ్యానించిన విషయం 'చంద్రబాబు' దృష్టికి వెళ్లింది. కనీస విద్యార్హతలు లేకున్నా...ఆమె ప్రసంగాలకు ముగ్దుడైన 'చంద్రబాబు' రాజకీయంగా ప్రోత్సహించి పదవులు కట్టబెట్టినా కూడా..వయస్సు మీరిపోతున్నా...ఇంకా పదవుల కోసం వెంపర్లాడడం సరికాదని గుంటూరు జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్‌ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

(259)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ