లేటెస్ట్

ఐఏఎస్‌లను ఉతికారేసిన ‘ఈనాడు’...!

విశాఖ భూకుంభకోణంలో ఇన్నాళ్లూ రాజకీయపార్టీ నాయకుల పాత్రను, వారు ఎన్నికోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారో సవివరంగా వివరించి ఎండ గట్టిన ప్రముఖ తెలుగుదినపత్రిక ‘ఈనాడు’ ఇప్పుడు ఆ కుంభకోణానికి అసలు కారకులైన ఐఏఎస్‌ అధికారుల అవినీతిని బయటపెట్టింది. విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ నివేదికలో అనుమానితులుగా పేర్కొంటున్న వారి వివరాలను తెలియజేసింది. ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులు ఈ భూకుంభకోణంలో ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొంది. నాడు వారు ఏ విధంగా వ్యవహరించారో పేర్కొంటూ, అధికారాన్ని అధికారపార్టీ నేతలకు ఎంత నిసిగ్గుగా తాకట్టుపెట్టారో పేర్కొంది. సీనియర్‌ ఐఏఎస్‌లు జె.శ్యామలరావు, కృష్ణబాబు, లవ్‌అగర్వాల్‌, గిరిజాశంకర్‌, ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌.సత్యనారాయణ, సునీల్‌శర్మ, వీరబ్రహ్మయ్యలు అప్పటి అధికారపార్టీతో అంటకాగారని, విశాఖ భూకుంభకోణానికి వీరు సహకరించారని ఎండగట్టింది. ఒక్కొక్కరి పేరును ప్రస్తావిస్తూ వీరు ఎలా అధికారపార్టీ నాయకులకు సహకరించారు, వారితో ఎలా కుమ్మక్కయార్కొ పేర్కొంది. మాజీ సైనికులకు సంబంధించిన ఎసైన్డ్‌ భూముల విషయంలో వీరు వ్యవహరించి తీరును నాటి సిట్‌ ఎలా తప్పుపట్టిందో తన ప్రత్యేక కథనంలో రాసుకొచ్చింది. మొదటి పేజీతో పాటు మూడో పేజీ మొత్తం వీరి చేసిన అరాచకాల కోసం కేటాయించింది. నాడు భూముల కుంభకోణంలో సిట్‌ విచారణలో వీరిపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ వారు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ, సిట్‌కు వారు ఇచ్చిన సమాధానాన్ని కూడా ప్రచురించింది. మాజీసైనికుల పేరిట ఎన్వోసీలను ఇవ్వడం, వాటిని అక్రమంగా రికార్డుల్లో చేర్చడం తరువాత ఆ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపాలరులకు అమ్మడం, వారు వాటిని ప్లాట్లు చేసుకుని అమ్ముకుని వ్యాపారం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ మొత్తం వ్యవహారంలో అధికారపార్టీ నాయకులతో పాటు, ఐఏఎస్‌ అధికారులు కూడా ప్రముఖ పాత్ర పోషించారని ‘ఈనాడు’ పేర్కొంది. విశాఖను రాజధానిగా చేస్తామని అధికారపార్టీ నాయకులు అంటున్నారని, అక్రమంగా కొట్టేసిన భూముల విలువను పెంచుకోవడానికే ‘విశాఖ’ను రాజధానిగా చేస్తున్నారనే ప్రధాన ప్రతిపక్షంతో పాటు వివిధ పార్టీలు చెబుతున్నాయి.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ