WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

స్కోచ్‌ అవార్డులతో ఎపి ప్రతిష్ట పెంచిన 'లోకేష్‌'...!

పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ శ్రీకృష్ణుని సారధ్యంలో సాగుతుందని కొంత మంది అర్జునుడి ద్వారా పనులు చక్కబెట్టడంలో...శ్రీకృష్ణుడు సూపర్‌..డూపర్‌ హిట్‌ అయ్యారని ఆశాఖ క్రిందిస్థాయి ఉద్యోగులు, అధికారులు చెప్పుకుంటున్నారు. శ్రీకృష్ణుడు ఎవరో తెలుసా...? ఆయనే ఆశాఖమంత్రి నారా లోకేష్‌బాబు...అర్జునుడిగా పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధి కమీషనర్‌ రామాంజనేయులతో పాటు ఇతర ముఖ్య అధికారులు ఆ పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారని కిందిస్థాయి ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో..ఆయన సారధ్యంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో అధర్మాన్ని ఓడించి...ధర్మాన్ని గెలిపించిన విషయం అందరికీ తెలుసు...! శ్రీకృష్ణుడు పాత్రను ప్రస్తుతం మంత్రి లోకేష్‌ పోషించి  నిజాయితీని, సమర్థంగా పనిచేసే అధికారులు ముందుండి నడిపిపించి, జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పెంచారని అవార్డులను స్వీకరించిన అధికారులు చెబుతున్నారు. ఈ శాఖకు మంత్రి లోకేష్‌ బాధ్యతలు స్వీకరించాక..అనేక మార్పులు, చేర్పులు జరిగాయని, ఆయన సారధ్యంలో పంచాయితీరాజ్‌, గ్రామీణాభావృద్ధిశాఖ, గ్రామీణ నీటిసరఫరా అధికారులు మరింత దూసుకెళుతూ అనేక సమస్యలను పరిష్కరిస్తూ...మంత్రి ప్రతిష్టను ఇంతకు ముందుకన్నా పెంచారని ఆయా శాఖలకు లభించిన అవార్డులపై కేంద్ర అధికారులు కూడా అభినందించారు.  ఇటీవల 'లోకేష్‌' నిర్వహిస్తున్న శాఖలకు ఏకంగా ఐదు స్కోచ్‌ అవార్డులు దక్కాయి. రాష్ట్రానికి తొమ్మిది విభాగాల్లో ఈ అవార్డులు దక్కగా..పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధి మరియు ఐటి శాఖకు,రెవిన్యూ శాఖ ఈ అవార్డులను దక్కించుకున్నాయి. స్కోచ్‌ టెక్నాలజీ విభాగంలో మంత్రి లోకేష్‌ నిర్వహిస్తున్న పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖల డ్యాష్‌ బోర్డుకు ఎల్‌ఇడి లైట్ల పర్యవేక్షణకు గాను స్కోచ్‌ మొబలిటీ అవార్డును ఆర్‌ఎస్‌ఐడి కార్డు వినియోగించి చెత్తసేకరణ, పర్యవేక్షణకు స్కోచ్‌ ఎకనమీబోర్డు అవార్డులు, ఇదే విభాగంగాలో ఎన్టీఆర్‌ జలసిరికి స్కోచ్‌కు ఎకానమీ అవార్డులు, బ్లూ ఎకానిమీలో తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన జలవాణి కార్యక్రమానికి అవార్డులు లభించాయి. ఢిల్లీలో ఈ అవార్డులను గ్రామీణాభివృద్ధి కమీషనర్‌ 'రామాంజనేయులు'.. మంత్రి అంతరంగిక అధికారి 'భాష' అసిస్టెంట్‌ కమీషనర్‌ 'సుధాకర్‌', జాయింట్‌ కమీషనర్‌ జె.ఎస్‌.వరప్రసాద్‌,ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇఎల్‌డి కిశోర్‌లు ఈ అవార్డులు అందుకున్నారు. తరువాత మంత్రి వీరందరినీ అభినందిస్తూ...తాను నిర్వహిస్తున్న శాఖలకు ఈ అవార్డులు రావడం సంతోషంతోపాటు, సంతృప్తి కల్గించిందని, అధికారులందరూ నిజాయితీగా, సమర్థతతో బాధ్యతలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పెంచారని ఆయన అభినందించారు. రాష్ట్రానికి స్కోచ్‌ అవార్డు తీసుకురావడంలో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెరిగిందని,టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు 'బ్రహ్మం' వెల్లడించారు. గుంటూరులోని రాష్ట్ర కార్యాలయంలో ఆ సంస్థ నాయకులు సంబరాలు నిర్వహించడంతో పాటు 'లోకేష్‌'ను అభినందిస్తూ...రాష్ట్ర ఖ్యాతిని దేశ,విదేశాల్లో ఇనుమడింపచేసిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు.


(254)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ