WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కోడెల గారూ... మీరే మాకు ఆదర్శం

 అంకిత భావంతో పనిచేసే మనస్తత్వం ఉన్న రాజకీయనాయకునిగా అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదుకు పేరుంది. ఆయనకు రాజకీయ అధికార అనుభవం మిగతా వారికన్నా ఎక్కువ ఉందని అందరికీ తెలుసు. ఎమ్మెల్యేగా, మంత్రిగా శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు.... నిర్వర్తిస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో 2014 నుండి ఇప్పటి వరకు పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ది శాఖల ద్వారా ఆయన చేపట్టిన పనులు జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు పొందాయి. ఆ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నినాదాన్ని చేపట్టి పూర్తి చేసిన ఘనత కూడా కోడెలకే దక్కింది.అంతే కాకుండా స్వచ్చందంగా అవయవాలను దానం చేసే కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసిన ఘనతకూడా కోడెలదే. ఈ కార్యక్రమంలో ఆయనకు తోడుగా నీడగా ఆయన కుమారుడు కోడెల శివరాంప్రసాద్‌ వెంట ఉండి అన్ని పనులు సక్రమంగా నెరవేర్చటానికి కారణమయ్యారు. 50వేల మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి అవయవాలను లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఈ విషయాలన్నిటిపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖా మంత్రి నారా లోకేష్‌ కోడెలకు లేఖ రాశారు. ఆ లేఖలో ఏముందంటే రాజకీయంగా మీరే మాకు ఆదర్శం, మీరే మా సంపద మీరు చేసట్టిన పనులను చూసి నేను ఎంతగానో గర్వించాను. గతంలో మీరు సూచించిన అమూల్యమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రజా సంక్షేమానికి, అభివృద్దికి నూతన ఆవిష్కరణలకు మార్పులు, చేర్పులకు మీ శాఖలో తగు చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సూర్యోదయ రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్ర లక్ష్యాలకు అనుగుణంగా చిత్త శుద్దితో, మీరు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు వెళ్తాను. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో అశ్రద్ద వహించను, ప్రజా సమస్యలు పరిష్కరించటంలో తన శాఖ అధికారులను ముందుకు నడిపిస్తానని అ లేఖలో ఆయన తెలియజేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో ఈ మూడేళ్ల కాలంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేశారు. ప్రజా సంక్షేమానికి మీరు శ్రమిస్తున్నారు. అన్ని విషయాలలో మిమ్మల్ని నేను ఆదర్శంగా తీసుకుంటానని, ఈ నియోజకవర్గంంలో సంక్షేమ కార్యక్రమాల అమలులో, ఫెన్షన్ల కేటాయింపులో, శాసనసభాదిపతి కోడెల శివప్రసాద్‌కు సహాయ సహకారాలు అందించటంలో ఆయన కుమారుడు కోడెల శివరాం ఎంతో కృషి చేస్తున్నారని లోకేష్‌కు తెలుసు. ఆ విషయాన్ని లేఖలో ప్రస్తావించకపోయినా... వ్యక్తిగతంగా శివరాంను అభినందించటం జరిగిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.



(184)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ