WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మరోసారి మానవత్వం చూపిన కోడెల

ఆయన సీనియర్‌ రాజకీయ నాయకుడు... ఆయన పేరు తెలియని వారుండరు... గతంలో ఎందరెందరికో.. ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు  అందించి మానవత్వం పరిమళిస్తున్న మహానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అన్యాయం ఎవరికి జరిగినా ఆ సంఘటనలు తన దృష్టికి వస్తే స్పందిస్తారు. వారికి న్యాయం చేస్తారు. ఇలా ఎందరెందరికో సహాయ సహకారాలు అందించి మానవత్వానికి మరో పేరు మా నాయకుడని ప్రశంసలు పొందారు. ఆ నాయకుడు మరెవరో కాదు ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కోడెల శివప్రసాద్‌. ఆయన ఈ రోజు కారులో వెళుతుండగా కోటప్పకొండ ఘాట్‌ రోడ్డులో మూర్చతో యామలయ్య అనే యువకుడు లోయలో పడిపోయాడు. స్పీకర్‌ కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న పోలీసులు అది చూసి కోడెల దృష్టికి తీసుకురాగా వెంటనే అక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి సుమారు 150అడుగుల లోయలో నుంచి ఆయువకుడిని క్షేమంగా బయటికి తీసుకు వచ్చారు. అక్కడి నుంచి తన స్వంత వాహనంలో ఆ యువకుడిని ప్రధమ చికిత్స చేయించేందుకు నరసరావుపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం నుండి ఆ యువకుడిని కాపాడి తన మానవత్వాన్ని మరోసారి రుజువు చేశారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినపుడు వెంటనే స్పందించి అన్ని విధాలా ఆదుకోవటం జరిగింది. అనేకమంది రాజకీయ నాయకులలో ఈ విధమైన లక్షణం ఎంత మందికి ఉందోకానీ కోడెలలో ఇలాంటి లక్షణాలు కోకొల్లలని మానవత్వం చూపించటంలో ఆయనకు ఆయనే సాటిగా రాజకీయ అధికార వర్గాలు వర్ణిస్తున్నాయి. విపక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మరియు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఓటర్లు కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయంగా కోడెలను ప్రసంసించటం విశేషం.


(162)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ