WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కాకినాడ దేవాదాయ పోస్టుకు రూ.50లక్షలా...!?

రెండు మూడు రోజుల్లో దేవాదాయశాఖలో తాత్కాలిక పదోన్నతలు కల్పించబోతున్నారు. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ పదోన్నతులపై నిర్ణయం తీసుకోకుండా, సీనియార్టీ జాబితాను తయారు చేయకుండా కొత్తగా హడ్‌హాక్‌ అనే పద్దతిని ప్రవేశపెట్టి..పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కాకినాడ డిప్యూటీ కమీషనర్‌ పోస్టుకు రూ.50లక్షలు బేరం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా ఇటీవల ఎసీబీ దాడికి గురైన విజయరాజా మరియు అజాద్‌లు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ తంతంగమంతా వీరిపై ఏసీబీ దాడులు జరగకముందు జరిగినట్లు తెలుస్తోంది. దేవాదాయశాఖ కమీషనర్‌ 'అనురాధ' నిజాయితీపరులైన అధికారిగా పేరున్నప్పటికీ ఆమె సమీప బంధువు ఒకరు ఈ పదోన్నతుల వ్యవహారంలో తలదూర్చినట్లు దేవాదాయశాఖలో ప్రచారం జరుగుతోంది. 

   ఇందులో ఏదో గూడుపుఠాణి జరిగిందని మీడియా వర్గాలతో కొందరు అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అధికారి, మరో కిందిస్థాయి అధికారి కూడా దీనిలో తల దూర్చినట్లు పలువురు దేవాదాయశాఖ అధికారులు చెప్పుకుంటున్నారు. సీనియార్టీ జాబితాను రూపొందించకుండా కాలయాపన చేసి మళ్లీ అడ్‌హాక్‌ ప్రమోషన్లు ఇవ్వడంలో ఉన్న పరమార్థం ఏమిటో..కమీషనర్‌గారు చెప్పాలి..? ప్రస్తుతం..కాకినాడ డిప్యూటీ కమీషనర్‌ మరియు అసిస్టెంట్‌ కమీషనర్‌ ఇన్‌ఛార్జిగా సూపరింటెండింగ్‌ అధికారి ఒకరు విధులు నిర్వహిస్తున్నారు. ఈ అదనపు బాధ్యతలు అప్పచెప్పడంలో కూడా లక్షల రూపాయలు చేతులు మారినట్లు గతంలో ప్రచారం జరిగింది. ప్రస్తుతం అసిస్టెంట్‌ కమీషనర్‌ హోదాలో ఉన్నవారికి హడ్‌హాక్‌ పద్దతిని ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని, త్వరలో ఉత్తర్వులు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

(153)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ