WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అనంత'లో 'కుల' కలహాలు...!

ఆయన ఒక సీనియర్‌ రాజకీయనాయకుడు. కరుడు కట్టిన కాంగ్రెస్‌ వాది. అంతే కాకుండా 'చంద్రబాబు' సామాజికవర్గానికి వ్యతిరేకి అని పేరుంది. 1983లో ఇంటిపెండెంట్‌గా తాడిపత్రి నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయినా..1985,1989,1994,1999,2004,2009 సంవత్సరాల్లో వరుసగా తాడిపత్రి నుంచి విజయం సాధించారు. పరిటాల రవి రాజకీయ ప్రవేశం చేయనంతవరకు అనంతపురం, తాడిపత్రి నియోజకవర్గాల్లో ఆయన కుటుంబం అధికారం చెలాయించేది. ఆ నాయకుడు ఎవరో కాదు...ప్రస్తుతం తెలుగుదేశం ఎంపిగా ఉన్న జె.సి.దివాకర్‌రెడ్డి. ఒకప్పుడు జెసి సోదరుల దౌర్జన్యం ఎలా ఉందంటే...రాజీవ్‌గాంధీ హత్య జరిగిన తరువాత జరిగిన ఎన్నికల్లో 'తాడిపత్రి' నియోజకవర్గంలో 70వేల మెజార్టీ కాంగ్రెస్‌కు ఆధిక్యం దక్కిందంటే..అక్కడ వారి హవా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో జెసి కేవలం వెయ్యి ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

   1994లో తిరిగి టిడిపి అధికారంలోకి వచ్చాక..పరిటాల రవి జెసి కుటుంబ హవాకు అడ్డుకట్టవేశారు. అప్పటి వరకు టిడిపి వారుపై దౌర్జన్యాలు చేసి జెసి కుటుంబం తరువాత పదేళ్ల వరకు నోరు మెదపలేదు..కాలు కదపలేదు. ఈ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా 'చంద్రబాబు' సామాజికవర్గానికి పోటీ చేసే అవకాశం దక్కలేదంటే..అందుకు జెసి దివాకర్‌రెడ్డే కారణమని ఆ సామాజికవర్గానికి చెందిన వారు విమర్శలు చేశారు. పదేళ్లు 'కమ్మోళ్లు' అణగదొక్కారు మమ్ముల్ని...ఇప్పుడు వారిపై తాము ఎందుకు పెత్తనం చేయకూడదని..2004 నుండి 2009 ఎన్నికల వరకు మంత్రి హోదాలో..పరిటాల అనుచరులు ఎవరూ కీలక బాధ్యతలు చూడకుండా అడ్డుపడ్డారు. ఏ తెలుగుదేశం పార్టీ అంటే...జెసి వ్యంగ్యంగా లెక్కలేనితనంతో వ్యవహరిస్తారో..ఆ పార్టీలోనే చేరి అనంతపురం ఎంపిగా విజయం సాధించడం జరిగింది. అనంతపురం, తాడిపత్రి ప్రాంతాల్లో తన కుటుంబీకులు, తన సామాజికవర్గానికి చెందిన వారే పెత్తనం చేయాలనేది జెసి కోరిక. అనంతపురం ఎమ్మెల్యేగా ప్రభాకర్‌చౌదరి, అనంతపురం మేయర్‌గా స్వరూప్‌లు ఆ పదవుల్లో ఉండడం జెసి భరించలేకపోతున్నారు. తెలుగుదేశం మద్దతుతో ఎంపినీ అయ్యాను...అని విశ్వాసం మరిచి..కులపరమైన విమర్శలు, ఆరోపణలు పరోక్షంగా చేస్తున్నారు. 

   అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి...కూడా ఒకప్పుడు కరుడుకట్టిన కాంగ్రెస్‌వాదే. యువజన కాంగ్రెస్‌ నాయకునిగా ప్రభాకర్‌చౌదరి ఉన్నప్పుడు ఆయనకు జెసికి మధ్య విభేదాలు ఉండేవి. ఆ తరువాత 'ప్రభాకర్‌' రాజకీయంగా వెనుకబడ్డారు..జెసి దూసుకెళ్లారు...ఐదేళ్లు అనంత మున్సిపల్‌ ఛైర్మన్‌గా ప్రభాకర్‌చౌదరి బాధ్యతలు నిర్వహించినప్పటికీ..అహంకారంతో 'చంద్రబాబు'ను దూరం చేసుకున్నారు. అవేరా..అనే సంస్థను ఏర్పాటు చేసి కొంత హడావుడి చేసినా..రాజకీయంగా ఎదగలేకపోయారు. 2014 ఎన్నికల్లో...అదృష్టం కలిసి వచ్చి...ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రభాకర్‌చౌదరి మళ్లీ జెసితో ఢీ అంటే ఢీ కొడుతూ..'చంద్రబాబు'కు మరింత దూరమయ్యారు..అనంతపురంలో ప్రభాకర్‌చౌదరి సామాజికవర్గ నేతలు తక్కువగా ఉన్నప్పటికీ ఆయనకు పోటీ చేసే అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే ఇవ్వడమే కుల కలహాలకు కారణమయ్యాయి. 'చంద్రబాబు' వద్ద వినయవిధేయలతో మాట్లాడే 'జెసి' బయటకు వచ్చాక...మా సామాజికవర్గానికి అధికారం దూరమయింది..భవిష్యత్‌లో కూడా మళ్లీ వచ్చే అవకాశాలు లేవని...వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అనంతపురంలో జరుగుతుంది..కులపరమైన ఆధిపత్యమే కానీ...పార్టీని బలోపేతం చేయడం కాదని, ప్రజాసమస్యలను పరిష్కరించడంలో పోటీ కానీ పడడం లేదు. ప్రభాకర్‌చౌదరిపై 'చంద్రబాబు' అసంతృప్తిగా ఉన్నారని తెలుసుకున్న 'జెసి' తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకుని మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డిని టిడిపిలో చేర్పించారు. 

   ఇది మింగుడు పడని 'ప్రభాకర్‌చౌదరి' గుర్నాథరెడ్డి చేరికకు హాజరు కానని చెప్పారు..హాజరు కాలేదు...'చంద్రబాబు'కు కులాభిమానం లేదని జెసి దివాకర్‌రెడ్డి తెలుసు. ఎన్నికల్లో..గెలిచే సత్తా ఉన్నా నాయకునికే టిక్కెట్‌ ఇస్తారని జెసికి తెలుసు. అహంభావంతో వ్యవహరించే 'ప్రభాకర్‌చౌదరి' జెసి వ్యూహాన్ని గమనించక తన రాజకీయజీవితాన్ని చేజేతులారా..చెడగొట్టుకుంటున్నారు. అనంతపురం మేయర్‌ స్వరూప్‌ మళ్లీకి మేయర్‌ అయ్యే అవకాశాలు లేవు. మున్సిపల్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో వారికి మళ్లీ అవకాశం దక్కదు. ప్రభాకర్‌చౌదరికి చెక్‌ పెట్టేందుకు గుర్నాథ్‌రెడ్డిని 'జెసి' రంగంలోకి దింపారు. అటు రాజకీయంగా...ఇటు తన సామాజికవర్గానికి చెందిన గుర్నాథ్‌రెడ్డికి రాజకీయంగా ఎదుగుదలను ఇచ్చారు. నిన్నటి వరకు తొందరపడి ప్రకటనలు చేసిన జెసి ఇటీవల కాలంలో తన కుమారుని రాజకీయ భవిష్యత్యం కోసం 'చంద్రబాబు'పై వ్యంగ్య వ్యాఖ్యానాలు..మానివేశారు..పైగా ఆయన ఆశీస్సులు ఉంటే తన కుమారుని రాజకీయభవిష్యత్‌ బాగుటుందని అంటున్నారు.

(298)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ