WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వ్యక్తిగత పనుల కోసమే సెలవు తీసుకున్నా': ఆదిత్యనాథ్‌దాస్‌

వ్యక్తిగత పనులు చక్కపెట్టుకునేందుకు నెల రోజులు సెలవుపై వెళ్లాలని భావించానని కేవలం పది రోజులు మాత్రమే సెలవు తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నానని...తన సెలవుపై ఎటువంటి రాజకీయాలు లేవని, దీనిపై ప్రచారం జరుగుతున్న కథనాల్లో వాస్తవం లేదని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ఆదిత్యనాథ్‌దాస్‌ స్పష్టం చేశారు. నిజాలు తెలుసుకుని పత్రికలు వార్తలను ప్రచురించాలని, తనను సంప్రదించకుండా..ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేయటం పట్ల 'దాస్‌' ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని 'జనం ప్రత్యేక ప్రతినిధి' స్వయంగా సంప్రదించగా పైవిషయాలను తెలుపుతూ...తాను జనవరి3వ తేదీన తిరిగి విధులకు హాజరవుతానని చెప్పారు. తన దగ్గర బంధువుకు కంటి ఆపరేషన్‌ జరిగిందని, వృద్ధుడైన తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత తనపైన ఉందని, అందుకే..నెల రోజులు సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకుని కూడా ఆఖరి నిమిషంలో పరిపాలనా సౌలభ్యం కోసం పదిరోజులకు కుదించుకున్నానని 'దాస్‌' తెలిపారు. తనకు మంత్రితో కానీ... ముఖ్యమంత్రితో కానీ..ఇతర ముఖ్యులతో కానీ ఎటువంటి విభేదాలు లేవని, తన సర్వీసులో ఎటువంటి మచ్చ లేకుండా బాధ్యతలు నిర్వహించానని రాజకీయ, అధికార, ఉద్యోగ వర్గాలతో ఎల్లవేళలా సహకరించి, నిబందనల ప్రకారం నిర్ణయాలు తీసుకున్నానని, మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తన పనితీరును ఎన్నోసార్లు మెచ్చుకున్నారని ఆయన తెలిపారు. ఒకప్పుడు మూడు శాఖలుగా ఉండే విద్యాశాఖను తాను ఒక్కడినే ఆయాశాఖల బాధ్యతలను నిర్వహిస్తున్న సంగతిని ఆయన గుర్తు చేస్తూ...తన భుజస్కంథాలపై పాలకులు పెట్టారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయని సంగతి వారికి తెలుసు..మీడియా వర్గాలకు తెలుసు..ఇతరులకూ తెలుసు..ఈ నేపథ్యంలో తాను సెలవుపై వెళ్లిన విషయానికి మసిపూసి మారేడుకాయ చేయవద్దని 'దాస్‌' కోరారు. కొంత మంది కావాలని 'దాస్‌'పై దుప్రృచారాన్ని చేస్తున్నారని సచివాలయంలో కిందిస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు 'జనం ప్రత్యేక ప్రతినిధి'కి తెలిపారు. ఇన్నేళ్ల తమ సర్వీసులో ఆధిత్యనాథ్‌దాస్‌ లాంటి అధికారిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని, ఉద్యోగవర్గాలతోపాటు, టీచర్లు, ఆయా సంఘాల అసోషియేషన్‌ నాయకులు ఇంతకు ముందు బాహాటంగానే తమ అభిప్రాయాన్నివెల్లడించారు. ఏది ఏమైనా ఆధిత్యనాథ్‌దాస్‌ సెలవుపై దుష్రృచారం కావడం దాన్ని ఆయనను ఖండించి పదిరోజులు మాత్రమే సెలవు తీసుకున్నానని, త్వరలో విధుల్లో చేరతానని చెప్పడంతో అపోహలు తొలిగిపోయినట్లే.

(157)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ