WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రన్న' క్రిస్మస్‌ పంపిణీలో కృష్ణా ఫస్ట్‌.!

'చంద్రన్న క్రిస్మస్‌ పంపిణీలో మిగతా జిల్లాల కన్నా కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని అధికార వర్గాలు తెలిపాయి. శనివారానికే ఎక్కువ మందికి కానుకలు పంపిణీ చేయడం జరిగిందని, మిగతావి ఈ రోజు పూర్తి అవుతాయని ఆ వర్గాలు తెలిపాయి. నిజమైన లబ్దిదారులకుమాత్రమే 'చంద్రన్న' కానుకలను అందజేశామని, ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం చెబుతున్నారు. క్రిస్మస్‌ కానుకల పంపిణీలో కలెక్టర్‌ లక్ష్మీకాంతం ప్రత్యేక శ్రద్దచూపి..గ్రామ స్థాయిలో అర్హులైన వారందరికీ అందే ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు, అవకతవకలు జరగలేదని, ఒకవేళ అటువంటిది జరిగితే..వాట్సప్‌ మెసేజ్‌ ద్వారా లేదా..ఇతర మార్గాల్లో సందేశం పంపించాలని కలెక్టర్‌ ప్రజలను కోరారు. అధికార పార్టీ నాయకులు కూడా గ్రామస్థాయిలో 'చంద్రన్న' కానుకలను పార్టీ అభిమానులకే కాకుండా ఇతర వర్గాలకు కూడా అందే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇందులో ఎటువంటి వివక్షకు పాల్పడలేదని విపక్షనాయకులు కూడా దీనిపై విమర్శలు చేయటం లేదని ఎమ్మెల్యేలు, మంత్రులు చెబుతున్నారు. కానుకలు అందని లబ్దిదారులు ఎవరైనా ఉంటే సంబంధిత అధికారులను వెంటనే కలసి ఆయా కానుకలను పొందాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతం బాహాటంగా పిలుపునిచ్చారు. ఏది ఏమైనా 'చంద్రన్న' కానుకల పంపిణీలో మొదటి స్థానంలో ఉండడం తమకు ఎంతో తృప్తిని కలిగించిదని కలెక్టర్‌ లక్ష్మీకాంతంతో పాటు ఇతర అధికారులు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపారని దీన్ని అభినందిస్తున్నానని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ మీడియా వర్గాలకు తెలిపారు.  

(156)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ