WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌'తో సంబంధం లేదు:గాలి

'జగన్‌'పై ఈగ వాలితే..సహించేది..లేదు..'జగన్‌' నాకు దేవుడిచ్చిన 'తమ్ముడు'...ఆయన జోలికి ఎవరు వచ్చినా..సహించను..! ఇవి ఒకప్పుడు వై.ఎస్‌.జగన్‌ గురించి...బళ్లారి మైనింగ్‌ కింగ్‌ 'గాలి జనార్థన్‌రెడ్డి' పేలిన మాటలు...! 'రాజశేఖర్‌రెడ్డి' మరణించిన తరువాత..ఆయన చెప్పిన మాటలు విన్న వారికి వారిద్దరూ అపూర్వసహాదరులనిపించింది. కానీ...తరువాత అక్రమమైనింగ్‌ కేసుల్లో నాలుగేళ్లు జైలు ఊచలు లెక్కపెట్టేసరికి...'జగన్‌'తో నాకు సంబంధం లేదని..'ఆయన' విషయంలో తాను వేలు పెట్టనని అంటున్నారు..'గాలి జనార్థన్‌రెడ్డి'. ఆదివారం నాడు ఒక ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..'జగన్‌' రాజకీయ విషయాల్లో తాను వేలు పెట్టనని, తనకు 'కర్ణాటక' ముఖ్యమని...అక్కడ కూడా ఎన్నికల్లో పోటీ చేయనని..రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేస్తానని ఆయన చెప్పుకున్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరనందుకే తనపై కేసులు పెట్టి వేధించారని, రాజశేఖర్‌రెడ్డి తనను పార్టీలో చేరమని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని 'గాలి' చెప్పుకున్నారు. 

   తనకు అందరూ అనుకున్నట్లు వేల కోట్లు ఆస్తులు లేవని, వందల కోట్లు ఉంటాయని అన్నారు. జైలు జీవితం తనలో మార్పు తీసుకువచ్చిందని, జైలులో ఉన్నప్పుడు భార్య గుర్తుకు వచ్చి దు:ఖించానని అన్నారు. తాను జైలుకు వెళ్లడం ఖాయమని తనకు తెలుసనని, తనను అరెస్టు చేస్తున్నప్పుడు...కూడా అదే విషయాన్ని సీబీఐ అధికారులకు చెప్పానని, వారు రమ్మనగానే వచ్చి పోలీసు జీపులో కూర్చున్నాని, తాను దేవుడికి కిరీటం చేయించినా..తనను దేవుడు ఆదుకోలేదనే బాధ ఉందని చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును తాను దూషించకుండా ఉండాల్సిందని, అప్పుడు జరిగిందానికి క్షమాపణ కోరుతున్నానని, తాను కొంచెం పరిణితో వ్యవహరించాల్సిందని, ఎక్కువ మంది శత్రువులను చేసుకోకుండా వ్యవహరించాల్సిందని, అవే తనకు కష్టాలను తెచ్చిపెట్టందని 'గాలి' బోరుమన్నారు. తన తీరు మారిపోయిందని, ఆంధ్రా రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోనని, కర్ణాటక రాజకీయాల్లో మాత్రం క్రియాశీలకపాత్ర పోషిస్తానని, బిజెపిలోనే కొనసాగుతానని 'గాలి' చెప్పుకున్నారు. మొత్తం మీద...జైలు జీవితం..'గాలి'లో ఎంతో కొంత మార్పు తీసుకువచ్చిందని ఆయన మాటలను బట్టి అర్థం అవుతోంది.

(20783)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ