WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మరో ఎనిమిది వారాలు సెలవు పొడిగించిన జెఎస్వీ ప్రసాద్‌...!

అనారోగ్య కారణాలతో నాలుగు వారాలు సెలవుపై వెళ్లిన పశుసంవర్థకశాఖాధిపతి జె.ఎస్వీ.ప్రసాద్‌...మరో ఎనిమిది వారాలు సెలవు పొడిగించినట్లు తెలిసింది. ఈశాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహించడం ఆయనకు ఇష్టం లేకే సెలవు పొడిగించినట్లు స్పష్టం అవుతుంది. అంతే కాకుండా పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ నియామకంలో సీనియర్‌ని కాదని, అర్హతలేని అధికారికి అర్హత చేకూర్చి పదవి ఇవ్వడం జెఎస్వీకి మింగుడపడలేదు. సీనియర్‌ అధికారిని డైరెక్టర్‌గా నియమించాలని సిఫార్సు చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డి మళ్లీ ఎవరెవరు ఒత్తిడిలు చేశారో బయటకు తెలియకపోయినా...ముందు చేసిన సిఫార్సును వెనక్కు తీసుకుని ఆ శాఖ డైరెక్టర్‌గా జూనియర్‌ అధికారి అయిన 'సోమశేఖర్‌'ను నియమించాలని సిఎంకు సిఫార్సు చేయటం, దాన్ని ముఖ్యమంత్రి ఆమోదించడంతో ఆయా ఉత్తర్వులు జారీ చేయటం ఇష్టం లేక జెఎస్వీ నాలుగు వారాలు సెలవుపై వెళ్లారని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' గతంలో ప్రచురించడం జరిగింది. ఆయన అనారోగ్యంతో సెలవుపై వెళ్లారా..? ఆ శాఖాదిపతిగా పనిచేయటం ఇష్టం లేక సెలవుపై వెళ్లారా..? లేక ఇంకేమైనా కారణాలున్నాయా..? మంత్రితో కానీ...సిఎంఒ అధికారులతో కానీ విభేదాలతో ఆయన సెలవుపై వెళ్లారా..? అనే విషయంపై ఆశాఖలో చర్చ జరుగుతోంది. ఆరోగ్యంగా ఉన్నాను..సీనియార్టీ ఉంది..గతంలో ఒత్తిడిలపై భయాందోళనలతో ఇచ్చిన లెటర్‌ వెనుక్కు తీసుకుంటున్నాను..జెఎస్వీతో 'కొండలరావు' మొరపెట్టుకున్నారు. 

  దీంతో జెఎస్వీ సూచనలతో ధరఖాస్తు చేసుకున్నా...సిఎంఒ కార్యాలయంలో ఫైల్‌ను మూడు మాసాలు పెండింగ్‌లో పెట్టారు..తనకు తెలియకుండా ఈ తంతంగం నడిపిస్తున్నవైనంపై అసంతృప్తితో ఉన్న జెఎస్వీ ముందుగా నాలుగు వారాలు సెలవు పెట్టి..తాజాగా మరో ఎనిమిది వారాలు సెలవుపెట్టడం వెనుక శాశ్వితంగా తప్పుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన మళ్లీ సెలవు పొడిగించారని ఆయా వర్గాలు అంటున్నాయి. మళ్లీ జెఎస్వీ పశుసంవర్థకశాఖలో పనిచేయడానికి రారని, ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం విధుల్లో చేరాల్సిన జెఎస్వీ మరో ఎనిమిది వారాల పాటు సెలవు పొడిగింపు కోసం ధరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ సెలవుపై ఉండడంతో జెఎస్వీ ప్రసాద్‌ ధరఖాస్తు ప్రభుత్వానికి చేరిందా..? లేక మరో రెండు మూడు రోజుల్లో విధుల్లో చేరనున్న 'దినేష్‌కుమార్‌'కు అందుతుందా..? లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు.

(118)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ