WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రవిశాస్త్రి'పై కక్షతోనే అలా చేశారా...?

భారత్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అజారుద్ధీన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'అజార్‌' సినిమా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. తాజాగా ఈ చిత్రంపై మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన పాత్రను స్త్రీలోలుడిగా చిత్రీకరించారని, ఇదంతా తనపై కక్షతోనే చేశారని ఆయన బిసిసిఐకి ఫిర్యాదు చేయబోతున్నారట. 'అజార్‌' సినిమాలో ఏ క్రికెటర్‌ పేరునూ పూర్తిగా ఉపయోగించలేదు. సాధారణంగా పిలుచుకునేలా అజార్‌, రవి, నవజ్యోత్‌, మనోజ్‌, కపిల్‌ వంటి పొట్టి పేర్లనే వాడారు. రవి పాత్రను గౌతమ్‌ గులాటీ పోషించాడు. ఆ ప్రాతను పూర్తిగా స్త్రీలోలుడిగా చిత్రీకరించడం, అమ్మాయితో గడపడం వంటివి చూపడం పట్ల రవిశాస్త్రి ఆగ్రహంగా ఉన్నాడట. గతంలో 'రవిశాస్త్రి, అజారుద్దీన్‌ క్రికెట్‌ ఆడే సమయంలో ఒకరిపై ఒకరికి కక్ష ఉందని, అజారుద్దీన్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వెల్లడికావడంలో 'రవిశాస్త్రి' పాత్ర ఉందని, ఈ కేసులో 'రవి' 'అజార్‌'ను కావాలనే ఇరికించాడనే కోపంతోనే ఈ సినిమాలో 'రవిశాస్త్రి' పాత్రను ఇలా చిత్రీకరించారని 'రవి' అభిమానులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద 'అజార్‌' చిత్రం అటు అజారుద్దీన్‌తోపాటు ఇటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేకపోయినా వివాదాలు సృష్టించడంలో సఫలం అయింది.

(206)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ