WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

శ్రీవారి ప్రసాదాల ధరల పెంపుపై భక్తుల అభ్యంతరాలు..!

టిటిడి అధికారులు శ్రీవారి ప్రసాదాల ధరలను అమాంతంగా పెంచడం ఏక పక్ష నిర్ణయంగా ఉద్యోగులు, అధికారులు చెప్పుకుంటున్నారు. ఈ ధరల పెంపుపై దేవాదాయశాఖమంత్రికి కనీసం చెప్పలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి ఆయన అనుమతి కూడా తీసుకోలేదు. చిన్న లడ్డూల ధర రూ.25/- నుంచి రూ.50/- పెద్ద లడ్డూల ధర రూ.100/- నుంచి రూ.200/- రూ.25/- రేటు ఉన్న వడ ధరను రూ.100/-లకు పెంచడంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నా...టిటిడి అధికారులు ఖాతరు చేయటం లేదు. పెంచిన ధరలను వెంటనే అమలు చేశారు. వాస్తవానికి పాలకమండలిలో ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా...ఇప్పుడు అధికారులే నిర్ణయం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం. కానీ ధరలు పెంచే అధికారం ఇఒకు ఉంది..తరువాత బోర్డులో అనుమతి తీసుకోవచ్చు అని నిబందనలు ఉన్నాయి. లడ్డూ ధర పెంచడంలో తొందర పడ్డారనే విమర్శ కూడా వస్తోంది. రూ.25/- లడ్డూను మరో పది రూపాయలు పెంచవచ్చు..కానీ..వంద రూపాయల లడ్డూను రూ.125/- లేదా రూ.150/- వరకు పెంచ వచ్చు. రూ.25/- రేటు ఉన్న వడను రూ.50/- చేయవచ్చు. కానీ ఏకంగా మూడు రెట్లు పెంచారు. ఈ ప్రసాదాల ధరల పెంపు విషయంలో సిఎంఒ అధికారులకు కూడా తెలియదని ప్రచారం జరుగుతోంది. టిటిడి బోర్డును నియమించిన తరువాత ఈ ధరల పెంపును బోర్డు తిరస్కరిస్తే..పరిస్థితి ఏమిటి..? 

  కాలినడకన వచ్చేవారికి కానీ, ఉచిత దర్శనానికి వెళ్లేవారికి కానీ ఒక్కొక్కరికి రెండు లడ్డూలను రూ.10/-లకే ఇస్తున్నారు..ఆ విధంగా రోజుకు 30వేల నుంచి 40వేల వరకు ఇస్తున్నారు. ఆ లడ్డూ ధరనే రూ.25/-కు పెంచితే బాగుండేదని..పోటులో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అధికారి ఒకరు మీడియాతో తన అభిప్రాయం చెప్పారు. ఇప్పటికే లడ్డూలపై సబ్సీడీ భారం పెరుగుతుందని అధికారులు కారణాలు చెబుతున్నా..భక్తులు ఇచ్చే కానుకలతోనే కదా..టీటీడీ ఈ ప్రసాదాన్ని ఇస్తోంది..! ఒక్కొక్క చిన్న లడ్డూ తయారీకి రూ.50/- ఖర్చు అవుతుందని పోటు వర్గాలు చెబుతున్నాయి. ఎటువంటి సబ్సీడీ లేకుండా లడ్డూలను భక్తులకు అమ్ముతున్నారు. ఇది వ్యాపార కేంద్రమా..? లేక పుణ్యక్షేత్రమా..? ఏది ఏమైనా ప్రసాదాల ధరలను అమాంతంగా పెంచడంపై ముఖ్యమంత్రి అంగీకరించారని స్పష్టమవుతోంది. లేకుంటే ఈ పాటికి పెంచిన ధరలు తగ్గించాలనే ఆదేశాలను కానీ...రెట్టింపు అయిన ధరలను తగ్గించాలనే ఆదేశాలైనా ఇచ్చేవారే...? అటువంటి ఆదేశాలు జారీ కాకపోవడంతో టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించినట్లు స్పష్టం అవుతుంది. దేశ,విదేశాల్లో పేరున్న శ్రీవారి ప్రసాదాల ధరలను అమాంతంగా రెట్టింపు చేయటం సరి కాదని పీఠాదిపతులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

(114)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ