WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రాంగోపాల్‌'కు బదిలీకి మంత్రి పుల్లన్న పట్టు...!

పౌరసరపరాల సంస్థలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి...వాటిపై చర్య తీసుకోవాల్సిన ఎండి రాంగోపాల్‌ మౌనంగా చోద్యం చూస్తున్నారు..ఆయనను వెంటనే బదిలీ చేసి...సంస్థలో జరిగిన అవినీతిపై ఏసీబీ అధికారులతో విచారణ జరిపించండి అని పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ముఖ్యమంత్రి చంద్రబాబును స్వయంగా కలసి విన్నవించారు. నెలలు గడిచాయి... పరిస్థితిలో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. మీరు..చూస్తూ ఉండండి..రాంగోపాల్‌ అవినీతిపై విచారణ జరిపిస్తాను..అని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పౌరసరఫరాల సంస్థలో చీమ చిట్టుక్కుమనాలన్నా...కాలు మెదపాలన్నా..ఆ సంస్థ అధిపతి రాంగోపాల్‌కు తెలియకుండా ఏమీ జరగదని మంత్రి పుల్లారావు చెబుతున్నారు. అక్కడ జరుగుతున్న తతంగాలేవీ బయటకు పొక్కకుండా ఎండి రాంగోపాల్‌ కట్టుదిట్టం చేశారని మంత్రికి తెలుసు. అవినీతి ఎక్కడ ఎలా జరుగుతుంది...? ఎవరెవరు చేతుల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి..ఎటు నుంచి మారుతున్నాయనే విషయం కూడా మంత్రి పుల్లారావుకే కాదు..మీడియా వర్గాలకే అంతుబట్టడం లేదు...ఆధారాలు దొరకడం లేదు. కానీ..ఆ సంస్థ ఎండి రాంగోపాల్‌ పేరుతో కొందరు అధికారులు..దళారులు..కోట్లు వసూలు చేశారనే ప్రచారం జరుగుతోంది. 

   రెండేళ్లపాటు ఆ సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి కూడా ఏమీ చేయలేకపోయారు...ఏది పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. 'లింగారెడ్డి'ని కూడా అవినీతిపరులు ఆకట్టుకున్నారనే ప్రచారం జరిగింది. రాంగోపాల్‌ను బదిలీ చేస్తానన్న ముఖ్యమంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారనే విషయం మంత్రి పుల్లారావుకు అంతుబట్టడం లేదు. రాంగోపాల్‌కు అండగా..సిఎంఒ అధికారి ఒకరు కంటికి రెప్పలా కాపాడుతున్నారనే విషయం మంత్రి దృష్టికి వచ్చింది. సంస్థల్లో ఏమి జరుగుతుందో అన్న విషయం కిందిస్థాయి ఉద్యోగులకు తెలుసు. కానీ ఏ ఒక్కరి నోటి నుంచి నిజాలు పెదవిదాటి బయటకు రావు. ఇంత కట్టుదిట్టమైన పరిపాలనను అనుకూలంగా మలచుకోవడంలో 'రాంగోపాల్‌'కు హ్యాట్సఫ్‌ చెప్పవచ్చునని..కొందరు అధికారులు మీడియా వర్గాలతో మాట్లాడుతూ ఆయనను వ్యంగ్యంగా అభినందిస్తున్నారు. ఈసారి ఐఎఎస్‌ల బదిలీలు ఎప్పుడు జరిగినా 'రాంగోపాల్‌'ను బదిలీ చేయటం ఖాయమని మంత్రి పుల్లారావు నమ్ముతున్నారు. ఈ రెండేళ్లల్లో పౌరసరఫరాల శాఖలో జరిగిన అక్రమాలు, అవినీతిపై ఏసీబీ అధికారులతో విచారణ జరిపించగలిగితే...చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబే ఖంగుతినే పరిస్థితి ఉందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

(299)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ