WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రాజశేఖర్‌' సమర్థతకు పెద్దపీట వేసిన 'చంద్రబాబు'...!

ఆయనొక సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి. అనేక శాఖలకు అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పనితీరుపై అధికారపక్షం కానీ..విపక్షంకానీ విమర్శలు, ఆరోపణలు చేయలేదు. ఆ అధికారి సర్వీసులో ఏ పత్రిక కూడా వ్యతిరేక కథనాలు ప్రచురించలేదు. అంత మంచి అధికారిగా ఆయనకు పేరుంది. ఆ కారణాలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను నాలుగుశాఖలకు అధిపతిగా నియమించారు. కృష్ణా పుష్కరాల పనుల్లో అవకతవకలు జరగకుండా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారు..జిల్లాల యంత్రాంగంతో పనిచేయించారు..ఆయన పనితీరును మెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ అధికారిని పౌరసరఫరాలశాఖ కమీషనర్‌గా నియమించారు. ఆ అధికారి పేరే రాజశేఖర్‌. నిజాయితీపరుడిగా, సమర్థుడిగా పేరున్నప్పటికీ సొంత సామాజికవర్గానికి ఎక్కువగా పనులు చక్కపెడతారనే విమర్శ ఉంది. ఆ విమర్శలను ఆయన సన్నిహితులు కొట్టిపారేస్తారు. పౌరసరఫరాలశాఖ కమీషనర్‌గా నియమించిన అనంతరం  ఆయనను వ్యవసాయ,మార్కెటింగ్‌, సహకారశాఖలతో పాటు వేరే శాఖలను కూడా ఆయనకే అదనపు బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పచెప్పడం జరిగింది. 

  ఈ మధ్య కాలంలో ఇన్ని శాఖల బాధ్యతలను చూస్తున్న అధికారిగా 'రాజశేఖర్‌'కు పేరుంది. ఆయన బాధ్యతలు చూస్తోన్న శాఖల మంత్రులు కూడా 'రాజశేఖర్‌' పనితీరును అభినందిస్తున్నారు. విచిత్రమేమిటంటే..ఆయన నిర్వహిస్తున్న శాఖల్లో అవినీతి పరులు ఎక్కువగా ఉన్నారనే విమర్శ ఉంది. అటువంటి శాఖలకు అధిపతిగా సమర్థవంతంగా, నిజాయితీగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'రాజశేఖర్‌' నిజంగా అభినందనీయుడే. అవినీతి మట్టి అంటదు..సమర్థతకు కొదవలేదు..నిజాయితీ ఆయన ఇంటిపేరు. రాజకీయ, అధికార వర్గాలు ఆయనను అనేక సందర్బాల్లో కొనియాడారు. ఎంత సమర్థుడు, నిజాయితీపరుడు కాకపోతే..రాజశేఖర్‌కు ఇన్ని శాఖలను ముఖ్యమంత్రి అప్పచెబుతారు..? ఇన్నిశాఖలను 'రాజశేఖర్‌'కు ముఖ్యమంత్రి కట్టబెట్టడంపై అప్పట్లో కొందరు ఐఎఎస్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా...ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆయనపై ఈగ వాలనివ్వడం లేదు. ఇన్నిశాఖలను ఒకే అధికారికి కట్టబెట్టడంపై ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం. ఈ శాఖలను తాను అడిగి వేయించుకోలేదని, ఇన్నిశాఖలను చూడడం తనకు కూడా కష్టంగా ఉందని, కానీ ముఖ్యమంత్రి అప్పచెప్పిన బాధ్యతలను కాదనలేను..కదా..త్వరలో జరిగే మార్పులు, చేర్పుల్లో తనకు భారం తగ్గుతుందేమోనని ఆయన భావిస్తున్నారు. ముఖ్యమంత్రి అభిమానాన్ని ఇంతగా పొందే అధికారులు తక్కువగా ఉన్న ఈ రోజుల్లో 'రాజశేఖర్‌' వంటి వారు అరుదుగా కనిపిస్తున్నారు. ఆయనలో ఒకటీ..రెండు బలహీనతలు ఉన్నాయని...మిగతా విషయాల్లో మాత్రం ఆయన నెంబర్‌వన్‌ ఆశాఖలో పనిచేస్తోన్న క్రింది స్థాయి అధికారులు, ఉద్యోగులు చెబుతున్నారంటే...'రాజశేఖర్‌' ఎంత సమర్థుడో స్పష్టం అవుతుంది.

(417)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ