లేటెస్ట్

పరిశుభ్రతపై ప్రత్యేక ప్రచారాన్ని చేస్తోన్న దక్షిణ మధ్య రైల్వే

స్వచ్ఛ భారత్ అభియాన్ చొరవతో కొనసాగుతూ, భారత ప్రభుత్వం దేశంలోని పరిసరాల పరిశుభ్రతను మరింతగా విస్తరింపజేయడానికి  మరియు మెరుగుపరచడానికి అనేక ప్రచారాలు మరియు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా  ఈ లక్ష్యం కోసం, పరిశుభ్రతను మరింత మెరుగుపరచడానికి, అపరిష్కృతాన్ని  తగ్గించడానికి మరియు పని-సంస్కృతిని మెరుగుపరచడానికి ఈ  ప్రత్యేక ప్రచారం 2.0 ప్రారంభించబడింది.

రైల్వే మంత్రిత్వ శాఖ నిర్దేశించిన  విధంగా అన్ని రంగాలలో పని చేసే ప్రదేశాల్లో  మెరుగైన పని-సంస్కృతి ద్వారా పరిశుభ్రత మరియు సుపరిపాలనను మరింత ప్రోత్సహించడానికి దక్షిణ మధ్య రైల్వే కూడా జోన్ అంతటా పెద్ద ఎత్తున అక్టోబర్ 2022లో ‘ప్రత్యేక ప్రచారం 2.0’ని చేపట్టింది. దక్షిణ మధ్య రైల్వే లోని ఆరు డివిజన్లు  - సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ మరియు నాందేడ్‌లలోని 731 రైల్వే స్టేషన్లలో ఈ  ప్రచారం జరిగింది.


ప్రత్యేక  ప్రచార  అవగహన  2.0 కింద అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో సమర్థవంతమైన పరిశుభ్రతను నిర్ధారించడానికి యంత్రాలతో  శుభ్రతను బలోపేతం  చేయడంపై దృష్టి పెట్టారు. వ్యర్థ పదార్థాలను సక్రమంగా పారవేయడం మరియు రైల్వే ప్రాంగణంలో పరిశుభ్రతను బాధ్యతాయుతంగా  ఉండేందుకు  ప్రయాణీకులకు  సహితం అవగాహన కల్పించడానికి అనేక అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది . అంతేకాకుండా, చెత్త మరియు ప్లాస్టిక్‌ను సమర్థవంతంగా తొలగించడానికి రైల్వే ట్రాక్‌లు మరియు యార్డులపై విస్తృతమైన పరిశుభ్రత కార్యకలాపాలు చేపట్టారు  . ‘హర్ పత్రి సాఫ్ సూత్రీ’ లక్ష్యాన్ని సాధించడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా ఉండడం గురించి కూడా ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాలు  నిర్వహించారు. రైల్వే స్టేషన్లలో సిబ్బంది, కాంట్రాక్టు కార్మికులు, ప్రజలకు, ప్రయాణీకులకు అవగాహన కల్పించేందుకు    నాటకాలు ప్రదర్శించారు. పాత రికార్డులు, యంత్రాలు, పనిముట్లు మరియు మొక్కలను తొలగించడం ద్వారా యూనిట్లు/కార్యాలయాలు శుభ్రం చేయబడ్డాయి.


దేశంలోని ప్రతి ప్రాంతంలో స్వచ్ఛతా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు మారుమూల ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లకు కూడా  ప్రచారాన్ని  విస్తరించింది. స్టేషన్లు, రైళ్లు, డిపోలు, యార్డులు, రైల్వే కాలనీలు మరియు ఇతర యూనిట్లలో పరిశుభ్రతకు సంబంధించిన మెరుగైన పరిశుభ్రత పద్ధతులపై కమ్యూనిటీ సర్వీస్, సమాచారాన్ని విస్తృతం   చేయడం తో పాటు   అవగాహన  పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. రైల్వే సిబ్బంది, కాంట్రాక్టు సిబ్బంది, బయటి ఏజెన్సీలు, సామాజిక సంస్థలు మరియు రైలు వినియోగదారుల భాగస్వామ్యంతో జోన్ అంతటా అక్టోబర్ నెలలో ప్రత్యేక అవగాహన   2.0  కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది.

దక్షిణ మధ్య రైల్వే చురుగ్గా పాల్గొని ప్రత్యేక ప్రచారం 2.0ని   విజయవంతం చేసినందుకు దక్షిణ మధ్య రైల్వే  టీమ్‌ని జనరల్ మేనేజర్ (ఇన్-ఛార్జ్) శ్రీ అరుణ్ కుమార్ జైన్ గారు  అభినందించారు. మహాత్మాగాంధీ కలలుగన్న స్వచ్ఛ, పరిశుభ్రమైన భారతదేశాన్ని సాధించేందుకు మనమందరం కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛత సందేశాన్ని మన మాటలు మరియు చర్యల ద్వారా నిరంతరం  మరింత విస్తృతంగా  వ్యాప్తి చేయాలని ఆయన సూచించారు, తద్వారా ఈ  సందేశం దేశం యొక్క  నలుదిశలుగా చేరుతుందని  పేర్కొన్నారు . 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ