WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'లీకువీరుడు'పై చర్యలు తీసుకోరా..'బాబూ'...!

సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి అయిన ఆయన కీ.శే. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వీరాభిమాని. వై.ఎస్‌ మరణానంతరం 'జగన్‌'కు కూడా అభిమానిగా మారారు. 2014 ఎన్నికలకు ముందు కాబోయే సిఎం 'జగన్‌' అని సహచర ఐఎఎస్‌ అధికారులకు నిత్యం ఫోన్‌ చేసి చెప్పేవారట. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా ఆయన ఆప్తుడే...! కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఆ ఐఎఎస్‌ అధికారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి..చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే విధంగా వెలుగుతున్నారు. ఆ అధికారి సామాజికవర్గమంటే 'చంద్రబాబు'కు ఉన్న బలహీనతను ఆసరాగా చేసుకుని..ఆ అధికారి చెలరేగిపోతున్నారు. చంద్రబాబునే కాదు..ఆయన కుమారుడు మంత్రి లోకేష్‌కు ఆయన ఇష్టుడట. సుమారు ముప్పయి సంవత్సరాల కిందట...కాశ్మీర్‌లోని ప్రాంత ప్రజలు తమకు ఏ దేశం అంటే అభిమానమో..బాహాటంగా చెప్పేవారట...? మేము మనుషులంలో ఉన్నాం..మనసు మాత్రం పాకిస్తాన్‌లో ఉన్నదని చెప్పేవారట. అది విన్నవారు..తెలుసుకున్నవారు...వారి వ్యాఖ్యలను ఖండించాలో...అహస్యహించుకోవాలో తెలియక మౌనంగా ఉండేవారట. ఈ ఐఎఎస్‌ అధికారి పనిచేసేది తెలుగుదేశం ప్రభుత్వంలో మనసు మాత్రం 'జగన్‌' పైన ఉంటుందట. పోలవరం ప్రాజెక్టుకుసంబంధించిన అవకతవకలు తనకు ఇస్తే...'సాక్షి' పత్రికల్లో కథనాలు రాయిస్తానని ఆ అధికారి అడిగేవారట. చివరకు ఒక ముఖ్యమైన పోస్టులో ఉండే అధికారిని కూడా అదే విధంగా అడిగేసరికి..ఆ అధికారి విస్తుపోయి...'తాను...మీ వలే రెండుపడవపై కాళ్లు వేయను..తనకు రెండు నాలుకలు లేవు..మిమ్మలను 'చంద్రబాబు' ఎలా నమ్ముతున్నారో..నాకు తెలియదు..నా సర్వీసులో ఇటువంటి పనులు ఎప్పుడూ చేయలేదు...మీమీద అభిమానంతో సిఎం చంద్రబాబు ప్రాధాన్యత కల పోస్టులో నియమించారు...ఇష్టమైతే కృతజ్ఞతతో పనిచేయండి..లేకుంటే...సెలవు పెట్టి వెళ్లండి..అంతే కానీ..ఈ విధంగా సలహా ఇచ్చారట. ఆ తరువాత..సలహా ఇచ్చిన అధికారి...'జనమ్‌ప్రత్యేకప్రతినిధి'కి ఈ విషయం చెబుతూ...' ముఖ్యమంత్రి చంద్రబాబుకు అటువంటి అధికారులే ఇష్టులు..వారి సేవలే ఆయనకు కావాలి..తమ వంటి అధికారులు..సమర్థులైన వారి సేవలు ఆయనకు అక్కర్లేదు...ఇటువంటి పరిస్థితి గత ముప్పయి సంవత్సరాల నుంచి చూడలేదని వ్యాఖ్యానించారు'. ఇప్పుడా అధికారి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తోన్న జీవోలు 'జగన్‌' పార్టీ నాయకులకు అందజేయడంలో నిత్యం బిజీగా ఉంటున్నారట. అంతే కాకుండా..'నరేగా' పనుల్లో అక్రమాలు జరిగాయని, నిధులు దారిమళ్లాయని, తెలుగుదేశం నాయకులు దోచుకున్నారని కేంద్ర ప్రభుత్వ అధికారులకు రహస్యంగా సమాచారం అందించారు. ఈ లీక్‌ వీరుడు వ్యవహారం 'చంద్రబాబు' ఆయన కుమారుడు 'లోకేష్‌'కు తెలిసినా..ఎవరో ఆయనకు గిట్టనివారు దుష్రృచారం చేస్తున్నారని భావిస్తున్నారట. 

   ఇటీవల కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినప్పుడు 'నరేగా' పనుల్లో అవకతవకలు జరగలేదని, భారతదేశంలోని రాష్ట్రాల్లో అన్నింటికన్నా ఆంధ్రప్రదేశ్‌లోనే బాగా జరిగాయని కితాబు ఇచ్చారు. ఈ లీక్‌ వీరుడైన అధికారిని 'చంద్రబాబు, ఆయన కుమారుడు ఎందుకు అభిమానిస్తున్నారు..అదే పోస్టులో ఎందుకు కొనసాగిస్తున్నారు...? లీక్‌ వీరుడి సామాజికవర్గమంటే.. భయమా..? లేక ఆయన చేతిలో వీరి రహస్యాలు ఏమైనా ఉన్నాయా..? మరొక విచ్రితమైన విషయం ఏమిటంటే...లీకు వీరుడైన అధికారిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ జాతీయ కేంద్ర కార్యాలయ కార్యదర్శి జనార్థన్‌ ఆయనపై ఈగవాలనివ్వకుండా...చేస్తూ..లోకేష్‌ చెవులు కొరుకుతున్నారట. ఒక వైపు చంద్రబాబును ఏ విధంగా అప్రదిష్టపాలు చేయాలి...?ఏ విధంగా 'జగన్‌' పత్రికకు ప్రభుత్వ విషయాలను అందజేయాలని భావిస్తుంటే అధికారిని ఈ ముగ్గురూ ఆసరా ఇస్తుంటే..తామేమి చేయగలమని మిగతా అధికారులు వాపోతున్నారు. పదేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వారికి వ్యతిరేకంగా ఎవరైనా అధికారి వ్యవహరించారా..? అప్పట్లో 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన అధికారులను వై.ఎస్‌. కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదు. వాస్తవమేమిటంటే..చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారిన అధికారులందరూ నిజాయితీపరులేనని అప్పట్లో వై.ఎస్‌ కూడా ఒప్పుకున్నారు. కానీ...చంద్రబాబు..ఇన్ని వాస్తవాలు తెలిసినా..బయటపడ్డా...కొందరు అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లినా...ఆ లీకు వీరుడైన అధికారిపై ఎటువంటి చర్యలు తీసుకోరు..కనీసం పిలిచి మందలించడం కూడా జరగలేదు. యధారాజా తథాప్రజా అన్నట్లు..ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..అన్నసామెత విషయంలా...ఈ అధికారి విషయంలో చంద్రబాబు బాటలోనే 'లోకేష్‌' నడుస్తున్నారని కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

(363)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ