WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సిఎం పేషికి 'లక్ష్మీనారాయణ'...!

ఆయన ఒక రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి. చంద్రబాబుకు వీరాభిమానిగా ఆ అధికారికి పేరుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ అధికారిని తమ శ్రేయోభిలాషిగా భావిస్తారు. 2014 ఎన్నికలకు ముందు సర్వీసు నుంచి రిటైర్డ్‌ అయిన ఆ అధికారి చంద్రబాబుకు చేదోడు..వాదోడుగా ఉన్న ఆ అధికారి ప్రచారంలో తన వంతు పాత్రను పోషించారు. టిడిపి అధికారంలోకివచ్చిన తరువాత ఆ అధికారి సేవలను 'చంద్రబాబు' తన కార్యాలయంలో వినియోగించుకుంటారని భావించినప్పటికీ..అప్పట్లో ఆయన నియామకానికి హెరిటేజ్‌ సాంబశివరావు అడ్డుపడ్డారని ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆయనను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కానీ...పర్యాటక సంస్థ ఛైర్మన్‌గా నియమించబోతున్నట్లు ప్రచారం జరిగినా..మళ్లీ ఆ ప్రతిపాదనలు నిలిచిపోయాయి. టీటీడీ ఛైర్మన్‌గా నియమిస్తారని ప్రచారం జరిగినా...ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఆ అధికారిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించాలని ఒక ముఖ్య అధికారి ఒకరు 'చంద్రబాబు'ను పదే పదే కోరారు. ఒక దశలో ఆయన నియామకానికి 'చంద్రబాబు' అంగీకరించినా... ఎందుకో అది మళ్లీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల ఆ అధికారితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకాంతంగా మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. సిఎం కార్యాలయంలో పనిచేసే ఓపిక తనకు లేదని, తనకు పదవి కావాలని తానెప్పుడూ అడగలేదని, చంద్రబాబు తన సేవలను ఎలా వినియోగించుకున్నా..అందుకు తాను సిద్ధమేనని రిటైర్డ్‌ అధికారి చెబుతున్నారు. ఇటీవల కాలంలో సిఎంఒలో వివిధ హోదాలో పనిచేస్తున్న అధికారుల పనితీరుపై మంత్రులు,ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఈ అధికారిని మళ్లీ సిఎంఒలో నియమించుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందని 'చంద్రబాబు' ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనే 'లక్ష్మీనారాయణ'. అధికార పార్టీ వర్గాలకు,అధికారులకు అత్యంత ఇష్టుడు. 

  తన అధికార సర్వీసులో ఏ ఒక్కరినీ బాధించలేదు..చంద్రబాబు పట్ల వీరవిధేయత ప్రదర్శించారని పేరు తెచ్చుకున్నారు. 'లక్ష్మీనారాయణ' వంటి అధికారి సిఎంఒలో లేకపోవడం లోటుగా ఉందని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అంటుంటున్నారనంటే ఆయన ప్రాధాన్యత ఎంతగా ఉందో అర్థం అవుతోంది. నూతన సంవత్సరంలో 'లక్ష్మీనారాయణ'ను సిఎంఒలో చేరతారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 'లక్ష్మీనారాయణ' వంటి విధేయత కల అధికారి, సిఎంఒలో లేరని అధికార పార్టీ వర్గాలు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించాయి. ఇటీవల లక్ష్మీనారాయణను కొందరు మీడియా ప్రతినిధులు కలిశారు..మీకు ఆ పోస్టు ఎందుకు రాలేదు..అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ..మీరే తనకు పోస్టు ఇస్తున్నారని మీరే రాశారు..తనకు ఫలానా పోస్టు కావాలని 'చంద్రబాబు'ను ఎప్పుడూ అడగలేదని, తన సేవలను 'చంద్రబాబు' వినియోగించుకోవాలంటే..ఆయనే చెబుతారని..గత ముప్పయిసంవత్సరాల నుంచి 'చంద్రబాబు'తో ఉన్న సంబంధం గురించి మీ అందరికీ తెలుసు అని..భవిష్యత్‌లో తన సేవలను 'చంద్రబాబు' వినియోగించుకున్నా ఫర్వాలేదు.. లేకున్నా..ఒకే..అని.. మిగతా వారివలే విమర్శలు చేసే మనిషిని కాదని..దయ చేసి తనకు ఆ పోస్టు ఇవ్వబోతున్నారు...ఇది ఇవ్వబోతున్నారని రాయవద్దని కోరారు. లక్ష్మీనారాయణను సిఎంఒలో నియమించుకుంటే పరిస్థితి మెరుగుపడుతుందని ముఖ్య అధికారి ఒకరు 'చంద్రబాబు'కు పలుసార్లు సూచించారు. కానీ 'చంద్రబాబు' మనసులో ఏముందో బయటపెట్టడం లేదు.

(456)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ