WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జన్మభూమి'లో మూడున్నర లక్షల పెన్షన్‌లు..!

జన్మభూమి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర లక్షల పెన్షన్‌లు ఇస్తున్నామని పాలకులు చెబుతున్నారు. అయితే వీటిలో వాస్తం లేదు. సుమారు రెండు లక్షల పెన్షన్‌లు వివిధ కారణాలతో ఆగిపోయాయి. చనిపోయినవారు, బోగస్‌ పెన్షన్‌లు దానిలో ఎక్కువగా ఉన్నాయి. ఆరెండు లక్షల పెన్షన్‌లు మాత్రమే 'జన్మభూమి'లో విడుదల చేసే అవకాశం ఉంది. మిగతా లక్షన్నర పెన్షన్లపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే సుమారు నాలుగున్నర లక్షల మంది పెన్షన్లకై ధరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఆ విధంగా ధరఖాస్తు చేసుకున్నవారిలో బోగస్‌ వారు ఎక్కువగా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారపార్టీ ప్రముఖులు..మీడియా వర్గాల వద్ద ప్రస్తావించడం జరిగింది. ఆథార్‌ కార్డులో వయస్సును మార్చుకుని పెన్షన్‌లుపొందేందుకు అర్హత సాధించారని, ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు చేతులు మారాయని అధికార వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకు ముందే నాలుగైదు లక్షలు బోగస్‌ పెన్షన్‌లు ఉన్నాయని, ఈ విషయం విచారణలో తేలియాని, వాటిని రద్దు చేయాలా..? అనే విషయంపై పాలకులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పెన్షన్‌ల వ్యవహారంలో 'జన్మభూమి'లో గ్రామస్థాయి నాయకుల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. మండలానికి ఎన్ని ఫెన్షన్‌లు కొత్తగా రాబోతున్నాయి..ఆయా పెన్షన్‌లు ఏ వర్గానికి ఇస్తున్నారనేదానిపై ఆరా తీయబోతున్నారు. అంతకు ముందు ధరఖాస్తు చేసుకున్నవారికి ఇవ్వకుండా..ముందుగా ధరఖాస్తు చేసుకున్న వారికి ఇవ్వకుండా..ఆ తరువాత చేసుకున్న వారికి ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. అయితే ఈసారి అటువంటి విమర్శలు లేకుండా..ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. పేరుకే తమకు ఆదేశాలు వస్తాయి..ఎవరెవరికి ఇవ్వాలో..'జన్మభూమి' గ్రామ కమిటీ నాయకులు, ప్రజా ప్రతినిధుల ద్వారా ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జిల ద్వారా ఇప్పటికే తమపై ఒత్తిడి తెచ్చారని ఉద్యోగులు చెబుతున్నారు. త్వరలో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో టిడిపి సానుభూతిపరులందరికీ పెన్షన్‌లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా అసలు విషయం ఎవరికీ చెప్పకుండా 'జన్మభూమి' కార్యక్రమంలో లబ్దిదారుల పేర్లను వెల్లడించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ సారి  పెన్షన్లలో టిడిపి సానుభూతి పరులకు ఎక్కువగా ఇవ్వాలని, ఈ విషయంలో ఎటువంటి ఒత్తిడిలకు తలొగ్గవద్దని, గ్రామ నాయకులకు, ఎమ్మెల్యేల నుండి ఆదేశాలు వెళ్లాయి. ఎన్నికలకు ముందు ఈ పెన్షన్‌లు వెయ్యి నుండి పదిహేను వందలకు పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బడుగు,బలహీనవర్గాలకు చెందిన టిడిపి సానుభూతి పరులందరికీ అర్హతను బట్టి పెన్షన్‌లు ఇవ్వాలని ఈ విషయంలో ప్రలోభాలకు, అవినీతికి పాల్పడవద్దని జన్మభూమి గ్రామ కమిటీ నాయకులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.

(166)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ