WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అంబటి' కూడా 'టిడిపి'లోకి వస్తాడట...!

నూతన సంవత్సర తొలిపొద్దుల్లో ఓ వార్త గుంటూరు జిల్లా రాజకీయాలను కుదిపేస్తోంది. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన మాజీ శానసభ్యుడు 'అంబటి రాంబాబు' టిడిపిలోకి రావడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారట. ఇప్పుడు ఈ వార్త..గుంటూరు రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. వై.ఎస్‌.జగన్‌కు జిగ్రీ దోస్తు అయిన 'అంబటి' తనకు జిల్లాలో టిడిపి పోటీ చేయడానికో సీటు ఇస్తే..ఆ పార్టీలో చేరిపోతానని తన సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నారట. దీని కోసం టిడిపిలో ఉన్న తన సామాజికవర్గ నేతలతో ఆయన మాట్లాడుకుంటున్నారట. టిడిపి అధినేత చంద్రబాబు, టిడిపిపై దూకుడుతో విమర్శలు చేసే 'అంబటి' కొన్నాళ్లుగా వైకాపా వ్యవహారాలపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. గత ఎన్నికల్లో 'జగన్‌' తాను ఇచ్చిన సలహాలను పాటించలేదని, అందుకే అప్పుడు పార్టీ ఓడిపోయిందని, ఇప్పుడు కూడా 'జగన్‌' అదే విధంగా వ్యవహరిస్తున్నారని, దీంతోమళ్లీ వైకాపా ఓడిపోతుందని, అందుకే పార్టీ మారితేనే తనకు రాజకీయ భవిష్యత్‌ ఉంటుందని ఆయన భావిస్తున్నారట. అదీ కాక...తమ సామాజికవర్గానికి వైకాపాలో పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని, టిడిపి ప్రభుత్వం తమ సామాజికవర్గంపై ప్రత్యేక శ్రద్దచూపుతుందని, ఆ పార్టీ అమలు చేస్తోన్న కార్యక్రమాల వల్ల తమ సామాజికవర్గంలో టిడిపి ప్రభుత్వంపై సానుకూలత వచ్చిందని, దీంతో రాబోయే ఎన్నికల్లో కూడా టిడిపి సులువుగా గెలుస్తుందని ఆయన అంచనా వేస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ మారాలని యత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తనకు గుంటూరు-2 కానీ..బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తే  టిడిపిలోకి రావడానికి తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను 'అంబటి' ఇస్తున్నారట. అయితే...'అంబటి రాంబాబు'ను పార్టీలో చేర్చుకోవడానికి టిడిపి నేతలు ఆసక్తి చూపడం లేదట. ఆయన వల్ల పెద్దగా ఉపయోగం లేదని, 'అంబటి' సామాజికవర్గ నేతలు అంటున్నారట. ఏది ఏమైనా...'జగన్‌' స్నేహితుడు,హితుడు కూడా పార్టీ మారాలని భావిస్తున్నారంటే...వైకాపా ఎంత బలహీనమైందో అర్థం చేసుకోవచ్చని రాజకీయపరిశీలకులు అంటున్నారు.


(7200)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ