WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కలెక్టర్‌ 'లక్ష్మీకాంతం'పై సిఎం ప్రశంసల జల్లు...!

వివిధ జిల్లాల్లో కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలో కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం బెస్ట్‌ కలెక్టర్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కితాబు ఇచ్చారంటే ఆయన పనితీరు ఎలా ఉందో స్పష్టం అవుతుంది. ఒకరిద్దరు కలెక్టర్లు మినహా మిగతా జిల్లాల కలెక్టర్లందరూ లక్ష్మీకాంతంతో పోటీ పడలేకపోతున్నారని ఒక ముఖ్య అధికారి కూడా మీడియా వర్గాలతో ఆఫ్‌ ది రికార్డుగా చెప్పారు. 'జన్మభూమి' ఏర్పాట్లను కలెక్టర్‌ 'లక్ష్మీకాంతం' వినూత్నంగా చేస్తున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కలెక్టర్‌ తమ జిల్లాల్లో 'జన్మభూమి' కార్యక్రమానికి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారనే దానిపై వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్‌ 'లక్ష్మీకాంతం' మాట్లాడుతూ 'జన్మభూమి' కార్యక్రమం సందర్భంగా గ్రామాల్లో ఆహారరక్షణకు ఒక అధికారిని నియమించారని, 970 గ్రామాల్లో  ఒక్కో రోజు ఒక్కో అంశంపై చర్చ, నిర్వహణకమిటీకి హెడ్‌మాస్టర్‌ సన్వయకర్తగా పెట్టి సంబంధించిన అంశాలపై ఇతర నిపుణులను కూడా అనుసంధానం చేసినట్లు ఆయన చెప్పారు. 

  ఈ విధానం వల్ల చర్చలు చక్కగా జరుగుతాయని, పౌష్టికాహారం విషయంలో కృష్ణా జిల్లాలో అమలు చేసిన కార్యక్రమాల వల్ల పిల్లలందరూ బరువు పెరిగారని, మాస్‌ న్యూట్రేషన్‌ ఫ్రీ జిల్లాగా కృష్ణా మారిందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుపై ప్రతి కార్యక్రమంలో చర్చ నిర్వహించనున్నారు. ఇందులో క్రీడల నిర్వహణకు ఒక పీడీని అనుసంధానం చేశామని కలెక్టర్‌ తెలిపారు. ఆహారం,ఆరోగ్యం,భీమా, విద్యుత్‌భద్రత ఇలా పదిహేను అంశాలపై అన్ని కుటుంబాలవారు తెలుసుకునేందుకు 15మంది అధికారులను ఏర్పాటు చేసినట్లు 'లక్ష్మీకాంతం' తెలిపారు. చెంబు తగ్గింది..ఆత్మగౌరవం బతికింది..అనే నినాదంతో ఒక ప్రత్యేక డ్రైవ్‌తో రోజు వారీ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలోనే పీతలు,చేపలు పెంపకంతో ఉత్పాతకత, ఆదాయం పెంచడంపై వచ్చిన పద్దతులపై ప్రదర్శనలను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లాలోని దివ్యాంగుల వివరాలన్నీ సేకరించి వారికి ట్రైవీలర్‌, చేతికర్రలు, టేప్‌రికార్డర్‌ వంటివి ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు అయ్యే నిధుల కోసం ఎంపిల నిధులతో పాటు, ఎన్‌ఆర్‌ఐల సహాయం, సామాజిక బాధ్యతగా కంపెనీల నుంచి సహాయం కోరామని 'లక్ష్మీకాంతం' తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశించిన విధంగా కుటుంబం పదివేలరూపాయల ఆదాయం సంపాదించుకునే విధంగా కోళ్లు, గొర్రెల పథకంతో పాటు ముద్ర రుణాలు, బ్యాంకులతో లింకేజీ, పశుగ్రాస కేంద్రాలు ఈ విధంగా 2.3లక్షల మంది లబ్దిదారులకు 'జన్మభూమి' కార్యక్రమంలో అందించబోతున్నారు. ఇతర జిల్లాలు కూడా 'లక్ష్మీకాంతం' అమలు చేస్తున్న కార్యక్రమాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లో పలు జిల్లాల కలెక్టర్లకు సూచించారు. అటు రాజకీయవర్గాలు, ఇటు అధికార వర్గాలు కూడా కలెక్టర్‌ లక్ష్మీకాంతం పనితీరుపట్ల సంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా, ఆ జిల్లా నుంచి మరో రెండేళ్ల వరకు ఆటంకం లేకుండా కొనసాగించాలని కోరుతున్నారు. 

  'లక్ష్మీకాంతం' పనితీరుపై సచివాలయంలో ఉన్నత స్థానంలో ఉన్న అధికారి ఒకరు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రతినిధితో మాట్లాడుతూ గతంలో తాను కూడా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాను..అప్పట్లో ఇటువంటి కార్యక్రమాలు అమలు కాలేదు..ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు..మారు మూల గ్రామాలకు అందనట్లు ఫిర్యాదులు అందితే..లక్ష్మీకాంతం స్పందించి వెంటనే అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారని..చెప్పారు. గతంలో 'లక్ష్మీకాంతం' తన వద్ద పనిచేశారని, అప్పట్లో తన పనితీరు ఈ విధంగా ఉంటుందని తాను ఊహించలేదని, ఇప్పుడు ఆయన పనితీరును అభినందిస్తున్నానని, చాలా మంది కన్నా ఆయన ఎక్కువగా కష్టపడుతున్నారని కితాబు ఇచ్చారు. రాజకీయ,అధికార,ఉద్యోగ, మీడియా వర్గాలు కూడా 'లక్ష్మీకాంతం' పనితీరును ముక్తకంఠంతో కొనియాడుతున్నారంటే..ఆయన పనితీరు ఏమిటో స్పష్టం అవుతుంది. 

  ఇంతకు ముందు 'లక్ష్మీకాంతం' పనితీరుపై 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' అనేక కథనాలను ప్రచురించి నప్పుడు.. ఆయనకు బాకా ఊదుతున్నారని..ఆయన నెత్తిన పెట్టుకుని ప్రోత్సహిస్తున్నారని..కొందరు అనాలోచితంగా ఆడిపోసుకున్నారు. కానీ..నిజం నిలకడమీద తెలుస్తుందనట్లు... ఇప్పుడు... 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కంటే ఎక్కువగా ఆంగ్ల మీడియా, తెలుగులో టాప్‌ ప్లేస్‌లో ఉన్న మీడియా కూడా ఆయన పనితీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తోన్న సంగతిని ఆ విమర్శకులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు.ఏది ఏమైనా వ్యక్తిగత లబ్దికోసమో...ఇతర అవసరాల కోసమే... 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' పనిచేయదు... ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా పనిచేసే అధికారులకు, నిజాయితీపరులకు, సమర్థులకు, ప్రజాకాంక్ష ఉన్న అధికారులకు  'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ఎప్పుడూ అండగా...ఉంటుంది. వారిని సమర్థిస్తూనే ఉంటుంది.

(625)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ