WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాజ‌కీయాల్లోకి వ‌స్తా...ర‌జ‌ని

ఎన్నాళ్ల నుంచో రాజకీయాల్లోకి వస్తారు..వస్తారూ..అని ఎదురు చూస్తున్న 'రజనీకాంత్‌' అభిమానుల కోరికను..ఆయన ఈ రోజు తీర్చారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. త్వరలో తాను తమిళనాడు రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానని ఆయన చెప్పారు.దేశ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయని... వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లోగా కొత్త పార్టీ స్థాపిస్తానని, తమ పార్టీ 234 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని తెలిపారు. డబ్బు, పదవి ఆశతో మాత్రం రాజకీయాల్లోకి రావడం లేదన్నారు.సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించటంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. తమిళనాడు రాజకీయ ముఖచిత్రమే మారిపోనుందంటు న్నారు రాజకీయ విశ్లేషకులు.వెండితెర మీద రజనీకి నీరాజనాలు పట్టిన జనం రాజకీయాల్లోనూ ఆదరిస్తారా అన్న చర్చ మొదలైంది. రజనీ అంటేనే స్టైల్. ఆయన బాడీ లాంగ్వేజ్ తో పాటు డైలాగ్ డెలివరీకి దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు. రజనీ కూడా తన సినిమాల్లో రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన పంచ్ డైలాగ్‌లను బాగానే పేల్చారు.


(348)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ