WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అభివృద్ధి ప్రధాత 'కోడెల'...!

పల్నాడు ముఖద్వారమైన 'నర్సరావుపేట' ఒకప్పుడు కక్షలకు, కార్పణ్యాలకు నిలయం. ముఠా రాజకీయాలకు,పగలకు,ఫ్యాక్షన్‌కు మారుపేరు. అటు వంటి నర్సరావుపేటలో ఇప్పుడు అభివృద్ధి పరుగులు తీస్తోంది. అభివృద్ధిలో పోటీ పడాలని ప్రతిపక్షానికి అధికార పక్షం సవాల్‌ చేస్తోంది. తాము చేస్తోన్న అభివృద్ధి పనులను చూడాలని..గతంలో ఇటువంటి అభివృద్ధి పనులు అప్పటి పాలకులు చేశారా..? అని అధికారపక్షం ప్రశ్నిస్తోంది. దశాబ్దాలుగా ఉన్న సమస్యను కేవలం ఏడు గంటల్లో పరిష్కరించి అధికార పార్టీ ఇదీ తమ సత్తా...అని కాలరెగరేసి చెప్పింది. తాము అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తాం..తప్ప వర్గ రాజకీయాలకు కాదని...మరోసారి నిరూపించింది.. అధికార తెలుగుదేశం పార్టీ.  ఈ అభివృద్ధి పనులు గంటల వ్యవధిలో పూర్తి అవుతున్నాయంటే దానికి ప్రధాన కారణం..'పల్నాటిపులి' డాక్టర్‌ కోడెలశివప్రసాద్‌రావు వల్లే. ఆయన ఎక్కడ ఉంటే..అక్కడ అభివృద్ధి పరుగులు తీయాల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో 'సత్తెనపల్లి' నుంచి గెలుపొంది.. 'నర్సరావుపేట, సత్తెనపల్లి' నియోజకవర్గాల్లో శరవేగంతో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. వందల కోట్ల రూపాయలతో ఈ రెండు నియోజకవర్గాల్లో పనులు పూర్తి అవుతున్నాయి. నియోజకవర్గాల్లో నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించి..'కోడెల' రికార్డు సృష్టించారు. క్రీడాస్థలాల ఏర్పాటు, స్మశానాల ఏర్పాటుతో పాటు, సిసి రోడ్లు నిర్మాణం, కళ్యాణమండపాల నిర్మాణం, కోటప్పకొండ దేవాలయం అభివృద్ధి చేయటం వంటి కార్యక్రమాల్లో 'కోడెల' అభివృద్ధి ప్రధాతగా మారిపోయారు. శతాబ్దాల పాటు పెండింగ్‌లో ఉన్న పనులను ఈ మూడేళ్లల్లో 'కోడెల' పరిష్కరిస్తున్నారు.

  ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గంలో గత పాలకులు అభివృద్ధిని మరిచిపోయి..విలాసాల్లో తేలియాడుతూ..ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడంతో..మళ్లీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ 'కోడెలే' పూర్తి చేయిస్తున్నారు. గతంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు తీయించిన 'కోడెల' ఇప్పుడు శానససభ స్పీకర్‌గా వ్యవహరిస్తూ ఈ రెండు నియోజకవర్గాల్లో వందల కోట్ల రూపాయల పనులు చేయిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు...సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారు. తాజాగా నర్సరావుపేటలోని ప్రకాశ్‌నగర్‌ వద్ద గల ఆర్‌యుబీ సొరంగాన్ని గంటల్లో పూర్తి చేసి..ఇదీ అభివృద్ధి అంటే...అని చూపించారు..'కోడెల'. కొన్ని సంవత్సరాల నుంచి..ఇక్కడ రైల్వే క్రాస్‌ వద్ద టన్నెల్‌ లేకపోవడంతో..రైళ్లు వస్తున్నప్పుడు గంటల కొద్ది వాహనదారులు నిలిచిపోవాల్సి వస్తుండేది. ఇక్కడ అండర్‌ టన్నెల్‌ నిర్మాణం చేయాలని ప్రజల నుంచి ఎన్నో విజ్ఞప్తులు వచ్చినా..గత కాంగ్రెస్‌ పాలకులు దీని గురించి పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తరువాత..ఈ మార్గంలో నిత్యం 40కిపైగా రైళ్లు వస్తుండడంతో అరగంటకోసారి రైల్వేగేట్‌ మూయాల్సిన రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి 'కోడెల' రైల్వే అధికారులను ఒప్పించారు. అదే సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా గంటల వ్యవధిలోనే దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించి సఫలీకృతులయి..ప్రజల హర్షద్వానాలను అందుకుంటున్నారు 'కోడెల'. ఏళ్లుగా ఉన్న సమస్య..గంటల వ్యవధిలో పరిష్కారం కావడంతో..'కోడెల' వల్లే సాధ్యమైందని, ఆయనకు తమ ధన్యవాదాలను తెలుపుకుంటున్నామని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.  మొత్తం మీద ఏళ్ల తరబడి పరిష్కరించలేని సమస్యను గంటల వ్యవధిలో 'కోడెల' పూర్తి చేయటంపై రాష్ట్ర వ్యాప్తంగా 'కోడెల'పై ప్రశంసల వర్షం కురుస్తోంది...!

తండ్రికి సహకరిస్తున్న తనయుడు...!

సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడానికి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు ఆయన తనయుడు డాక్టర్‌ కోడెల శివరామ్‌ తన వంతు సహకారం అందిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చేవారికి అందుబాటులో ఉండి..వారి సమస్యల పరిష్కరిస్తూ..తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకుంటున్నారు శివరామ్‌. నియోజకవర్గంలోని కార్యకర్తలకు, సానుభూతిపరులకు ఎల్లప్పుడూ అందుబాటులోఉంటూ..తనదైనశైలిలో రాజకీయాల్లో రాణిస్తున్నారు 'శివరామ్‌'. నియోజకవర్గంలో అవయవదానంపై ఆయన ప్రజలకు అవగాహన కల్గిస్తూ..అవయవ దానం వల్ల ఎటువంటి ఫలితాలు సాధించవచ్చో..వారికి వివరిస్తూ..వారిని అవయవదానానికి ప్రోత్సహిస్తున్నారు. అంతే కాకుండా నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తూ..తండ్రికి తగ్గతనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు.
(1050)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ