WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ'పై విషప్రచారం...!

ఒక వారం రోజుల నుంచి వాట్సప్‌,పేస్‌బుక్‌,ట్విట్టర్‌ల్లో ఓ ఫొటో ఒకటే ట్రెండింగ్‌ అవుతోంది. అదీ వాట్సప్‌ గ్రూప్‌లో మరీ ఎక్కువగా తిరుగుతోంది. లక్షలాది మంది...ఈ ఫొటోను చూసి... ఆశ్చర్యపోయారు...కొందరు బాధపడిపోయారు...! మరి కొందరు బాగా అయిందిలే అనుకున్నవాళ్లూ ఉన్నారు...! ఇంతకీ ఈ ఫొటో ఏమిటి..? అంటే...'స్వర్గీయ వంగవీటి రంగా' ఒక సభలో మాట్లాడుతుండగా...ఆయన వెనుక ఒక వ్యక్తి చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు..ఆయన ఫొటో చుట్టూ..రెడ్‌ ఇంక్‌తో రౌండప్‌ చేసి..'ఇతను..ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ...' అని ఆయన ఒకప్పుడు 'వంగవీటి మోహన్‌రంగా' డ్రైవర్‌ అని ప్రచారం చేస్తున్నారు. సోషల్‌మీడియాలో ఈ ఫొటో వారం రోజుల నుంచి తిరుగుతుండగా..దానిపై ఎవరికి వారు..ఇది నిజమేనా..? అని మరి కొందరు ఫేక్‌ అని కొట్టిపారేస్తుండగా..నిన్న ఓ ఛానల్‌ దీనిపై ఓ వార్తను ప్రసారం చేసింది. ఆ ఫోటోలో 'రంగా'తో పాటు ఉన్న వ్యక్తి...'విష్ణుమొలకల రాజహంస' అని ఆ ఛానెల్‌ తేల్చి వేసి...'రంగా'తో ఉన్న వ్యక్తి...'రాధాకృష్ణ' కాదని స్పష్టం చేసింది. అయినా...'రాధాకృష్ణ'పై కొంత మంది పనికట్టుకుని ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అసలు 'రాధాకృష్ణ'పై ఇటువంటి ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది...? ఎందుకు ఆయనపై ఈ రకమైన విషప్రచారానికి దిగారు. దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు...? వారి లక్ష్యమేమిటి..? 'రాధాకృష్ణ'ను 'రంగా' డ్రైవర్‌గా మార్చి..ప్రచారం చేసి ఏం సాధించాలనుకుంటున్నారు...! 'రంగా', రాధాకృష్ణ రాష్ట్రంలో రెండు ప్రభావం చూపగల సామాజికవర్గాలకు చెందిన వారు కావడంతో..ఆ కులాల మధ్య మళ్లీ గొడవలు సృష్టించడానికే...దీనిపై అసత్య ప్రచారానికి పూనుకున్నారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  'ఆంధ్రజ్యోతి'లో ఒక చిన్నస్థాయి ఉద్యోగిగా జీవితం ఆరంభించిన 'రాధాకృష్ణ' ఆ సంస్థకు ఛైర్మన్‌గా ఎదగడాన్ని తోటి జర్నలిస్టులే చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. తమతో పాటు పనిచేసిన వ్యక్తి ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను శాసించగల స్థాయికి ఎదగడం, సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం వారు సహించలేక...వ్యక్తిగతంగా కానీ..వృత్తిపరంగా కానీ.. 'రాధాకృష్ణ'ను ఏమీ చేయలేకే...ఇటు వంటి నీచ ప్రచారానికి దిగారని తెలుస్తోంది. దీని వెనుక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక రాజకీయ పార్టీ హస్తం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 'రాధాకృష్ణ' తాను రాసే వ్యాసాలలో ఆ పార్టీని టార్గెట్‌ చేస్తున్నారని, ఆపార్టీ అధినేతకు లొంగకపోవడంతో..వారికి సంబంధించిన సోషల్‌మీడియా విభాగం ఈ రకమైన ప్రచారానికి దిగి..రాధాకృష్ణ పరువును తీయాలని చూస్తోందని పలువురు రాజకీయనాయకులతోపాటు...కొందరు జర్నలిస్టులు పేర్కొంటున్నారు. అయితే..ఈ రకమైన ప్రచారంలో కూడా వాస్తవాలకు దగ్గరగా వారు ప్రచారం చేయలేకపోయారని...వారు అంటున్నారు. 

   అసలు 'వంగవీటి రంగా'ను 'రాధాకృష్ణ' కలిసే అవకాశమే లేదు. ఎందుకంటే...'రంగా' విజయవాడ రాజకీయాలను శాసిస్తున్న సమయంలో... 'రాధాకృష్ణ' నిజామాబాద్‌లో చదువుకుంటూ ఉండిఉంటారు...! 'రాధాకృష్ణ' తండ్రి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారైనా..వారు ఎప్పుడో...నిజామాబాద్‌కు వలస వెళ్లారు...'రాధాకృష్ణ' అక్కడే జన్మించారు...! ఆయనకు ఊహ తెలిసే సమయానికి ఆయనకు హైదరాబాద్‌ గురించి తెలిసి ఉండవచ్చు కానీ...విజయవాడ అక్కడి రాజకీయాల గురించి పెద్దగా తెలిసే అవకాశమే ఉండదు...! మరి అటువంటి వ్యక్తి...రంగా డ్రైవర్‌గా ఎందుకు ఉంటారు. తాను చిన్నతనం నుంచి కష్టపడి పైకి వచ్చానని, తనది బీద కుటుంబమని..రాధాకృష్ణ పలు ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. కొన్నిసార్లు తెలియక అసాంఘిక పనులు కూడా చేశానని, తరువాత తప్పు తెలుసుకున్నానని కూడా ఆయన ఆ ఇంటర్వ్యూల్లో  నిజాయితీగా చెప్పారు. ఎక్కడో..నిజామాబాద్‌లో పుట్టిపెరిగి..హైదరాబాద్‌లో తిరిగిన 'రాధాకృష్ణ' 'విజయవాడ'కు చెందిన 'రంగా'కు డ్రైవర్‌గా ఎలా ఉంటాడు...? ఒక వేళ వారు చెబుతున్న ప్రకారమైనా..'రంగా' విజయవాడలో ఎదిగిన సమయానికి 'రాధాకృష్ణ'కు ఇరవై సంవత్సరాలు కూడా ఉండి ఉండవు..మరి ఫొటోలో ఉన్న వ్యక్తికి అప్పటికే దాదాపు ముప్పయి సంవత్సరాలకు పైగా వయస్సు ఉన్నట్లు కనిపిస్తోంది...! అబద్దం చెప్పినా...అతికినట్లు చెప్పాలని..పెద్దలంటారు..ఈ అసత్యవార్తలు సృష్టించిన వారు..పెద్దల సామెతను మరిచిపోయినట్లున్నారు. గమ్మత్తేమిటంటే...ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై ఇటువంటి ప్రచారం జరుగుతుంటే ఆయన సంస్థలో పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగులు భలే సంతోషపడిపోతున్నారట. ఆయనకు అంతే కావాలిలే...! అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు... మొత్తం మీద 'రాధాకృష్ణ' ఇంటిదొంగలపై, విశ్వాసఘాతకులపై ఓ కన్నేసి ఉంచితే మంచిది...!
(1786)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ