WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వినుకొండలో 'ఆంజనేయులు'కు ఎదురుగాలి...!

గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో రెండుసార్లు విజయం సాధించిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులకు ఓటర్లల్లో ఎదురుగాలి వీస్తున్ననేపథ్యంలో..'జగన్‌'కు సానుభూతిపరులైన క్రైస్తవ ఓటర్లను ఆకాంక్షించి మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధించాలని తపనపడుతున్నారు. వినుకొండ నియోజకవర్గంలో మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, ఆంజనేయులు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఆయన వ్యక్తిగత సహాయకుడు స్థానిక నాయకులపై పెత్తనం చెలాయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జీవి స్వంత సామాజికవర్గ ఓటర్లల్లో కూడా ఇప్పుడిప్పుడే వ్యతిరేకత ప్రారంభమైంది. మూడవ సారి గెలిచి జిల్లా అధ్యక్షుడి కోటాలో మంత్రి పదవి పొందాలని 'ఆంజనేయులు' ఆశపడుతున్నారు. ఆయన సమీప బంధువైన పెదకూరపాడు ఎమ్మెల్యే మద్దతు కూడా ఉంటుందని, ఈ నేపథ్యంలో తనకు మంత్రి పదవిని 'చంద్రబాబు' కట్టబెడతారని జివి నమ్మకం. అందుకేనేమో...గెలిస్తే మంత్రిని అవుతాను..అని ఆఫ్‌ ది రికార్డుగా అధికారులతో, నాయకులతో చెబుతున్నారట. వినుకొండ నియోజకవర్గంలో ఆయనపై ఓడిపోయిన 'నన్నపునేని రాజుకుమారి' కుమార్తె 'సుధ' రాజకీయంగా తెరమరుగవడంతో...పెదకూరపాడులో ఆంజనేయులు బంధువుపై ఓడిపోయిన వైకాపా నాయకుడు 'బొల్లా బ్రహ్మనాయుడు' వినుకొండలో పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. టిడిపి ఓటర్లల్లో వ్యక్తం అవుతున్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకునేందుకు జివి ప్రయత్నించకుండా 'జగన్‌' పార్టీకి చెందిన సానుభూతిపరులపై గాలం విసురుతున్నారు. 'జివి' ప్రత్యర్థి అయిన 'బ్రహ్మనాయుడు' తనకు ధీటుగా ఉన్న నేపథ్యంలో ఆయన వేస్తోన్న ఎత్తుగడలు.. ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే...!



(490)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ