WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జూన్‌ మొదటి వారానికి అమరావతికి హైకోర్టు తరలింపు..!

రాష్ట్ర విభజన చట్టంలో పొందు పర్చిన ఉమ్మడిరాష్ట్ర హైకోర్టు తరలింపుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను ఆమోదించి కేంద్రం నోటిఫికేషన్‌ జారిచేయబోతోంది. ఇప్పటికే విజయవాడలోని కొన్ని భవనాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన విధితమే. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇప్పటికే జాప్యం జరిగిందని, సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే పలుసార్లు హోంమంత్రి, ఇతర కేంద్ర నాయకులను కలసినప్పుడు అభ్యర్థించారు. ముందుగా హైకోర్టును విభజించి...తరువాత సిబ్బందిని విభజిస్తారు. మూడు నెలలు ముందే...ఈ ప్రక్రియ పూర్తి కానుంది. వేసవి సెలవులు తరువాత హైకోర్టు విజయవాడలో పనిచేయడం ఖాయమని కొందరు పిపిలు అధికార పార్టీ నాయకులకు చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు, టిఆర్‌ఎస్‌ ఎంపిలు లోక్‌సభలో పలుసార్లు ఈ సమస్యపై లేవనెత్తడం..అదుగో..ఇదుగో.. అంటూ కేంద్రం జాప్యం చేయటం గత కొన్నాళ్లుగా జరుగుతోంది. అయితే ఎట్టికేలకు మరికొన్ని రోజుల్లో దీనిపై రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేయబోతున్నారు.

(176)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ