WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ...!

ఏప్రిల్‌ మొదటి వారంలో ముగియనున్న పలువురు సభ్యత్వం మార్చి మొదటి వారంలో ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరుగురు రిటైర్‌ కాబోతున్నారు. వీరిలో 'దేవేందర్‌గౌడ్‌, సిఎం రమేష్‌, చిరంజీవి'లు ఉన్నారు. తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపికయ్యేందుకు అవకాశం లేదు. ఆంధ్రా నుంచి టిడిపికి రెండు ఖాయంగా లభిస్తాయి..మూడోదానిపై కొంత కసరత్తు చేయాల్సి ఉంది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుకు బెర్త్‌ రిజర్వ్‌ అయిందని ఇంతకు ముందే 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనాన్ని ప్రచురించింది. 

  రెండోసారి తన రాజ్యసభ సభ్యత్వం పొడిగింపు ఖాయమని సిఎం రమేష్‌ భావిస్తున్నారు. సిఎం చంద్రబాబు, ఆయన కుమారుడు 'లోకేష్‌'లతో నిన్న మొన్నటి దాకా ఉన్న సంబంధాలు 'రమేష్‌'కు బెడిసికొట్టినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఏదో విధంగా తనకు రాజ్యసభ సభ్యత్వం ఖాయమని సిఎం రమేష్‌ ధీమాతో ఉన్నారు. ఉత్తరాంధ్రకు దగ్గరగా ఉండే 'రామకృష్ణుడు'కు రాజ్యసభ ఇస్తున్న నేపథ్యంలో కృష్ణా,గుంటూరు,ప్రకాశం జిల్లాల్లో ప్రభావం చూపే సామాజికవర్గానికి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మూడో సీటు మాత్రం 'రెడ్డి' సామాజికవర్గానికి ఇస్తారని టిడిపి నాయకులు చెబుతున్నారు. నెల్లూరుకు చెందిన పారిశ్రామికవేత్తకు ఆ సీటు ఇస్తారని పార్టీలో గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎస్సీ వర్గానికి చెందిన వారికి కూడా అవకాశం ఉండవచ్చు. అయితే...ఈ అంచనాలే కాకుండా... ఓ అగ్రనటుడు...అనూహ్యంగా టిడిపిలో చేరబోతున్నారని, ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది కనుక జరిగితే...టిడిపిలో ఇది అనూహ్య పరిణామమే. మొత్తం మీద నోటిఫికేషన్‌ రావడంతో..టిడిపి నాయకులు తమ అభ్యర్థిత్వం పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. అయితే...'జన్మభూమి' కార్యక్రమం పూర్తి అయిన తరువాతే..'చంద్రబాబు' దీనిపై దృష్టిసారించే అవకాశం ఉంది.

(203)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ