WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాబోయే...ఈ ఒత్తిడి తట్టుకోలేం అంటున్న అధికారులు..ఉద్యోగులు..!

నిత్యం వీడియో కాన్ఫెరెన్స్‌, టెలీకాన్ఫెరెన్స్‌లతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు జిల్లాల కలెక్టర్లు, ప్రాజెక్టుల పిడిలు, ఐఎఎస్‌ అధికారులతోపాటు క్రింది స్థాయి అధికారులను సెలవు రోజుల్లో కూడా ఇబ్బంది పెడుతున్నారని, వారు ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని, గతంలో ఈ విధంగా వ్యవహరించే 'చంద్రబాబు' ఉద్యోగులకు దూరం అయ్యారని ఉద్యోగులు చెబుతున్నారు. ముంగళవారం నాడు 'జన్మభూమి' కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఉదయం వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరువాత ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పర్యటించి..తిరిగి సచివాలయానికి వచ్చి మళ్లీ కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. బుధవారం నుండి 'జన్మభూమి' కార్యక్రమం ఉధృతంగా జరగనున్న నేపథ్యంలో అధికారులతో ముఖ్యమంత్రి జిల్లాల అధికారులతో కలెక్టర్లు మరింత బిజీ అవబోతున్నారు. మానసిక ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నామని, అధికారులు,ఉద్యోగులు ఉన్నతాధికారులకు చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిన్న చిన్న విషయాలపై సచివాలయంలో రెండు మూడు సార్లు వీడియోకాన్ఫెరెన్స్‌ నిర్వహించిన చంద్రబాబు రేపటి నుంచి జన్మభూమి కార్యక్రమం పూర్తి అయ్యేవరకు..ప్రతి రోజూ వీడియో,టెలీకాన్పరెన్స్‌ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు కూడా వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించాలని ఆదేశాలు వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా...వీడియో, టెలీకాన్పెరెన్స్‌ ఒత్తిడిలకు అధికారులు, ఉద్యోగులు తట్టుకోలేకపోతున్నారనే విషయం వాస్తవమే. ఇదే విషయాన్ని మంగళవారం నాడు సచివాలయంలో కొందరు ఉద్యోగులు మీడియా వర్గాలతో ఆఫ్‌ ది రికార్డుగా మాట్లాడుతూ మళ్లీ 2004 పరిస్థితిని చంద్రబాబు కొనితెచ్చుకుంటున్నారని..దానికి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.

(323)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ