WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఖజానాలో నిధుల్‌ నిల్‌...!పెండింగ్‌ చెల్లింపులు పుల్‌...!

గత రెండు నెలల నుండి కేవలం ఉద్యోగుల జీతాలు...ఇతరత్రా ముఖ్యమైన శాఖలకు తప్ప...అన్ని రకాల బిల్లులు చెల్లింపులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొంత మంది బిల్లులకు అనుమతి ఇచ్చినా..నగదు చెల్లించడం నిలిపివేశారు. ఆ విధంగా అనధికార ఆదేశాలే తప్ప..అధికార ఆదేశాలు రాలేదని ఖజానా అధికారులు చెబుతున్నారు. నిధులను నిలిపివేయడంతో..కొన్నిశాఖల్లో అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతోంది. మరొక మూడు నెలల్లో ఆర్థికశాఖ ముగియనున్న నేపథ్యంలో ఇప్పటిల్లో ఈ కష్టాలు తీరే అవకాశం లేదు. ఖజానా కార్యాలయాల్లో బిల్లులు చెల్లింపుపై ఎలాంటి నిషేదం లేదని, ఆర్థిక మంత్రి 'యనమల' చేస్తున్న ప్రకటనల్లో నిజం లేదని విమర్శలు వస్తున్నాయి. నిధుల కొరత అధికంగా ఉండడంతో..ఖజనా..ఉపఖజానా కార్యాలయాల్లో వేల కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. 

  సుమారు పదివేల కోట్ల రూపాయల చెల్లింపులు నిలిచిపోయాయని, వివిధ జిల్లాల నుండి సచివాలయానికి సమాచారం అందింది. ఇప్పట్లో..ఈ బిల్లులు చెల్లించే అవకాశం లేదని, ఆ అధికారులు చెబుతున్నారు. విచిత్రమేమిటంటే..బ్యాంకులు చెక్కులు స్వీకరిస్తూ..నగదు చెల్లింపులు మాత్రం చేయటం లేదు. ఇంజనీరింగ్‌ విభాగం ఉన్న శాఖల్లో కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. అంతేకాకుండా ఉద్యోగుల టిఎ,డిఎలు ప్రభుత్వ కార్యాలయాలకు చెల్లించాల్సిన అద్దె సొమ్ములు, పాఠశాలల్లో భోజనం చెల్లింపు బిల్లులు, స్టేషనరీ, వసతి గృహాలకు చెల్లింపులు పూర్తిగా నిలిపివేయటం జరిగింది. కేవలం అత్యవసర ఖర్చుల కోసమే అడిగిన దానిలో నాలుగోవంతు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఈ బిల్లులు చెల్లింపు ఇబ్బంది మరో ఆరు మాసాలపాటు ఉండవచ్చునని ఆధికారులు చెబుతున్నారు. త్వరలో నిధులు విడుదలవుతాయని..బిల్లులు చెల్లింపు త్వరలో ఉంటుందని చెబుతున్నారు.

(96)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ