WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నామినేటెడ్‌ పదవుల పంపకానికి 'మూఢం' అడ్డంకా....!?

డిసెంబర్‌ మాసంలో నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన 'చంద్రబాబు, చినబాబు'ల హామీలు ఇంత వరకు ఆచరణకు నోచుకోలేదు. ఆయా హామీలు గాలికి కలిసిపోయాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. సుమారు 30 మార్కెట్‌యార్డు కమిటీలకు పాలకమండలిని నియమించాల్సి ఉండగా...ఏకాభిప్రాయంలేదనే సాకుతో కొన్ని..అదుగో..ఇదుగో అని మరికొన్నింటికి నియామకాలు జరగలేదు. కొంత మంది కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవుల కాలం పూర్తి అయినా...వారికి పొడిగింపు కానీ..లేకే వేరే వారికి కానీ ఇవ్వలేదు. డిసెంబర్‌ 14 నుంచి జనవరి 14 వరకు ధన్మర్మాసం అని ...మూఢంలో పదవుల పంపకం చేయకూడదని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఎమ్మెల్సీలు చెబుతున్నారట. అదుగో..ఇదుగో...అంటూ 36నెలలు గడిచినా..ఇంకా ముప్పయి శాతం నామినేటెడ్‌ పదవులు ఖాళీగానే ఉన్నాయి. తండ్రీ,కొడుకులిద్దరూ ఇన్ని హామీలు ఇచ్చినా...ఇంత వరకు అమలు కాలేదని, కొన్ని నామినేటెడ్‌ పోస్టుల నియామకాలకు వారిద్దరకు సన్నిహితంగా ఉండే నాయకులు అడ్డుపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి తరువాతే నామినేటెడ్‌ పదవులు..పంపకం ప్రారంభమవుతుందని, కేంద్రపార్టీ కార్యాలయ నాయకులు చెబుతున్నారు. ఇటీవల కొంత మంది ద్వితీయశ్రేణి నాయకులు 'చినబాబు'ను కలసి మార్కెట్‌ కమిటీలు చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్నాయి..భర్తీ చేయమని కోరగా..ఇంకా కమిటీల నియామకం పూర్తి కాలేదా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారట. కమిటీ నియామకాల భర్తీకి ఎవరు అడ్డం పడుతున్నారు..అనే విషయం 'చినబాబు'కు తెలియదేమో..అని ఆయనను కలసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తారా...లేదా మళ్లీ ఉగాది పండుగ అని చెబుతారా..? ఇంత వరకు జరిగింది అదే..మళ్లీ జరగబోయేది కూడా అదేనేమో..ఆ నాయకులు మీడియా వర్గాల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలక వర్గ భర్తీలో ఎమ్మెల్యేలు,మంత్రులు అడ్డుపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా మార్కెట్‌కమిటీ పాలకమండలి నియామకంలో జాప్యానికి కారణం ఎవరైనా...తండ్రీ కొడుకులదే బాధ్యత అనే విషయం మంత్రులు కూడా గుర్తు చేస్తున్నారు.

(192)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ