WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

10వేలు ఇస్తే..బూతులు తిట్టినోడినీ ఆహ్వానిస్తారా...!?

విజయవాడలో జరుగుతున్న పుస్తకమహోత్సవాలు ఈసారి చాలా అట్టహాసంగా ప్రారంభమ య్యాయి. అదే సమయంలో కొంత రగడ కూడా చోటు చేసుకుంటోంది. ఈ పుస్తకమహోత్సవాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలసి ప్రారంభించారు. ప్రారంభించిన రోజే...కమ్యూనిస్టు నాయకుడు 'నారాయణ'కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. కమ్యూనిస్టుల స్టాల్స్‌ దగ్గరకు 'వెంకయ్య'ను తీసుకెళ్లిన 'నారాయణ' కమ్యూనిజం పుస్తకాలను ఆయనకు అందించగా..'వెంకయ్య' స్పందిస్తూ..ఆ పుస్తకాలను కమ్యూనిస్టేలే..ముద్రిస్తారని...అనగా...'చంద్రబాబు'..వాటిని వారే చదువుతారు..ఇంకెవరూ చదవరని వ్యాఖ్యానించి సందడి చేశారు. అగ్రనాయకులు ఛలోక్తులు విసుర్లతో పుస్తకమహోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే తరువాత రోజు తెలంగాణ నుంచి వస్తోన్న కవుల సమ్మేళనంపై వివాదం చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా..ఆంధ్రాపై బూతులు తిట్టిన కవి ఇక్కడ సందేశం ఇస్తారనే విషయం పుస్తకమహోత్సవ నిర్వాహకులు తెలియజేశారు. దీనిపై ఆంధ్రాకు చెందిన ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. బూతులు రాసిన వారికి సందేశం ఇచ్చే అర్హత ఉందా..? కవి సమ్మేళనంలో ఆయనెలా పాల్గొంటారు..? ఆయన రాసిన రాతలేమిటి..? బూతులు రాసిన వారు ఐదువేలు ఇస్తే...ఆహ్వానిస్తారా..? ఆంధ్రాపై విషం చిమ్మన వారు కవుల రూపంలో మళ్లీ ఆంధ్రాపై విషం చిమ్మడానికి వస్తే..ఆహ్వానిస్తారా..అంటూ ప్రజాసంఘాలు, టిడిపికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


  పుస్తకసమ్మేళనంలో 10వేలు ఇస్తే..ఎవరైనా స్టాల్‌పెట్టుకోవచ్చని...అదే విధంగా సాయంత్రం జరిగే సమ్మేళనంలో పాల్గొనవచ్చని..నిర్వహకులు తెలపడం..దానిపై ప్రజాసంఘాలు అభ్యంతరం చెప్పడంతో సమస్య ముదిరిపోయింది. ఒకవైపు బూతులు రాసినోడిని ఇక్కడకు రానిచ్చేదిలేదని...ప్రజాసంఘాలు భీష్మించినా..బూతుకవిని స్టేజ్‌పైకి నిర్వాహకులు తీసుకువచ్చారు. దీంతో...ప్రజాసంఘాలు రగిలిపోయాయి..ఆయన ముందు ఆంధ్రాప్రజలకు క్షమాపణ చెప్పాలని, అతన్ని ఇక్కడ నుంచి పంపేయాలని డిమాండ్‌ చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. చివరకు బూతుకవిని అక్కడి నుంచి పంపేయడంతో సమస్య సద్దుమణిగింది. అయితే 10వేలు ఇస్తే..ఎటువంటి వారినైనా.. ఇక్కడకు రానిస్తామన్న నిర్వాహకుల ప్రకటన వివాదాస్పదం అవుతోంది. ఆంధ్రాపై బూతులు తిట్టి, పత్రికల్లో రాయలేని భాషలో రాసిన బూతుకవిని సందేశాలను ఇక్కడ వినిపిస్తారా..? ఆయన రాసిన బూతును..పుస్తక సమ్మేళనానికి వచ్చిన వారికి పంచి పెడతారా..? ఇదేనా పుస్తకమహోత్సవాల నుంచి ప్రజలు నేర్చుకోవాల్సిందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏది ఏమైనా..ఇటువంటి వారిని సమ్మేళనానికి ఆహ్వానించి..నిర్వహకులు తప్పుచేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికైనా ఇటువంటి తీరు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



(983)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ