లేటెస్ట్

చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడి జరిగింది. ఈరోజు కృష్ణా జిల్లా నందిగామలో టిడిపి నిర్వహిస్తున్న సభకు హాజరయ్యేందుకు వెళుతున్న చంద్రబాబునాయుడు కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో చంద్రబాబు సీఎస్‌వో మధుబాబుకు గాయాలు అయ్యాయి. గాయపడిన మధుబాబుకు చికిత్స కోసం దగ్గరలోని హాస్పటల్‌కు తరలించారు. దాడి సమయంలో విద్యుత్‌ను ఆపివేసినట్లు తెలుస్తోంది. తన కాన్వాయ్‌పై దాడి చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా రౌడీలకు భయపడేది లేదని ఆయన అన్నారు. పోలీసుల భద్రత సరిగా లేకపోవడం వల్లే దాడి జరిగిందని ఆయన విమర్శించారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ