WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సచివాలయంలో తొలిసారి కలెక్టర్ల సదస్సు...!

ఆంధ్రుల నూతన రాజధాని అమరావతిలో తొలిసారి కలెక్టర్ల సదస్సు జరగబోతోంది. ఈ నెల 18,19వ తేదీల్లో వెలగపూడిలోని సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో జిల్లా కలెక్టర్ల సదస్సును నిర్వహించబోతున్నారు. రాష్ట్ర విభజన తరువాత కలెక్టర్ల సదస్సు సచివాలయంలో జరగడం ఇదే తొలిసారి. సచివాలయం వెలగపూడికి తరలివచ్చినా..వివిధ కారణాలతో ఇంతకు ముందు కలెక్టర్ల సదస్సును ప్రైవేట్‌ ఫంక్షన్‌హాలులో జరిగాయి. తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో... ప్రభుత్వానికి కొంత మేర ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కలెక్టర్ల సదస్సును హైదరాబాద్‌లోని జూబ్లీహాల్‌లో జరిగేవి. రాష్ట్ర విభజన జరిగిన తొలినాళ్లల్లో కలెక్టర్ల సమావేశాలను అక్కడే నిర్వహించారు. అయితే ప్రభుత్వం హైదరాబాద్‌ నుంచి అమరావతికి రావడంతో..కలెక్టర్ల సదస్సును విజయవాడ కేంద్రంగా ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో నిర్వహించారు. అయితే...ఫైవ్‌స్టార్‌ బిల్లులు పెరిగిపోవడంతో.. సచివాలయంలోనే కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తే ఖర్చును తగ్గించుకోవచ్చన్న భావనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించడంపై ప్రభుత్వ వర్గాలు, టిడిపి వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.  


(157)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ