WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కుప్పం కంటే ముందే పులివెందులకు నీళ్లు ఇచ్చాం:ఉమ

విజయవాడ- పులివెందులలో సుమారు 4మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయని, రాయలసీమ వాసులు ఆ ఏడాది సంతోషంగా ఉన్నారని ఏపి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారంనాడు జలనరుల శాఖ కార్యాలయం, విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఏడాది రాయలసీమకు 123 టిఎంసీలు నీళ్లు ఇచ్చామని, రాయలసీమ రతనాల సీమ కాబోతుందని, పట్టిసీమ ఫలాలతో రైతులు ఆనందంగా ఉన్నారని అన్నారు. అనుకున్న లక్ష్యం మేరకు ప్రాజెక్టులన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయని అన్నారు. నీటిపారుదల రంగ చరిత్రలో గేట్లు ఎత్తే లష్కర్లు దేవుడి వంటివారన్నారు. జగన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు. కుప్పం కంటే ముందు పులివెందులకు నీరు విడుదల చేసిన ఘతన చంద్రబాబుదని, వైసీపీ నేతలు ఆరోపణలు జగన్ అజ్ఞానాన్ని బయటపెడుతున్నాయన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయటమే జగన్ పనిగా పెట్టుకున్నారన్నారని ఉమా ఎద్దెవా చేసారు.

(225)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ