WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

దుర్గగుడి ఇఒపై దుష్రృచారం చేస్తున్నారా..!?

ఆమె నిజాయితీపరురాలైన మహిళా ఐఎఎస్‌ అధికారి. గతంలో ఏశాఖలో ఏహోదాలో బాధ్యతలు నిర్వహించినా..ఎటువంటి విమర్శలు..ఆరోపణలు ఆమెపై ఏ ఒక్కరూ చేయలేదు. ప్రశాంతమైన జీవినాన్ని గడుపుతున్న ఆమెను దుర్గ గుడి ఈఒగా పాలకులు, ఉన్నతాధికారులు నియమించారు. అంత వరకు దుర్గగుడిలో జరుగుతున్న దుబారా ఖర్చులను ఆమె పూర్తిగా అదుపు చేశారు. ప్రకటనల రూపంలో రూ.80లక్షలను ఖర్చు పెట్టిన వైనాన్ని తెలుసుకుని 'అమ్మ'వారికి ప్రచారం అవసరం లేదు..అమ్మవారంటే..తెలియనివారు ఎవరు..? అని ఆ దుబారా ఖర్చును నిలిపివేశారు. దుర్గగుడి పాలకమండలి నియమించినంత వరకు ప్రశాంతంగా పాలన సాగిపోయింది. అవినీతిపరులను, గజదొంగలను కట్టడి చేయడమే కాకుండా, నిజాయితీపరులకు పోస్టింగ్‌లు ఇచ్చి..వారిని కీలకప్రాధాన్యత పోస్టులు ఇచ్చి ప్రోత్సహించారు. పది రోజుల క్రితం జరిగిన సంఘటనపై రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. రాత్రిపూట దుర్గగుడి మూసివేసిన తరువాత తాంత్రిక పూజలు జరిపారని, ఇదిగో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఎలక్ట్రానిక్‌ మీడియా పదే పదే ప్రచారం చేసింది. రెండు పత్రికలు కూడా ఆమెను టార్గెట్‌ చేసుకుని కథనాలు ప్రచురించాయని విమర్శలు వస్తున్నాయి. పాలకమండలి ఛైర్మన్‌కు, సభ్యులకు ఆమె కనీస మర్యాద ఇవ్వలేదని పలుసార్లు వారు బాహాటంగా ఆరోపించడమే కాకుండా మంత్రికి, ముఖ్యమంత్రికి వారు ఫిర్యాదు చేశారు. దుర్గ గుడి ఇఒ ఎవరైనా పాలకమండలి ఆదేశాలను పాటించాల్సిందేనని ఛైర్మన్‌తో పాటు సభ్యులు హుకూం జారీ చేయడం జరిగింది. పాలకమండలికి ఎటువంటి అధికారాలు ఉంటాయి..ఇఒకు ఎటువంటి అధికారాలు ఉంటాయనేవి వారికి తెలియదు. ఎవరి గౌంతెమ్మకోర్కెలు వారివి...! దుర్గగుడి ఛైర్మన్‌గా, సభ్యులుగా నియమితులైతే అనేక పనులు చక్కపెట్టుకోవచ్చని..ఎంతో కొంత వెనుకేసుకోవచ్చని.. భావించిన పాలకమండలిలోని కొందరు  దానిపై ఇఒపై ఒత్తిడి తెచ్చారు. వాస్తవంగా పాలకమండలికి, ఇఒకు మధ్య విభేదాలు ఉన్నాయా..? లేవా..? వారి మధ్య అభిప్రాయభేదాలు ఏ విషయం మధ్య వచ్చాయా...? అనే దానిపై ఇఒ పెదవి విప్పడం లేదు. ఒకసారి ఆమె వాస్తవాలను వివరించగలిగితే..ఎవరెవరు ఏంకోరారు..ఎవరెవరు ఏమి ఆశించారు..అనే విషయాలు బయటపడతాయి...! పాలకమండలి ఛైర్మన్‌ సభ్యుల వ్యవహారశైలే..దుర్గగుడి వ్యవహారంలో దుష్రృచారం జరగడానికి కారణమని, ఇప్పటికైనా సరైన విధంగా పాలన జరగకుండా ఉంటే పాలకమండలిని రద్దుచేస్తానని ముఖ్యమంత్రి హెచ్చరించారంటే..వారి గొంతెమ్మకోర్కెలు, వారి వ్యవహారశైలి ఆయన దృష్టికి వచ్చినట్లు వెల్లడి అవుతుంది. 

  అమ్మవారి సొమ్ము దుర్వినియోగం కాకుండా అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి కోట్లాది రూపాయలను దేవస్థానంకు అందించిన ఘనత ఇఒకే చెందుతుంది. ఈ విషయాన్ని దుర్గగుడిలో పనిచేసే ఉద్యోగులు బాహాటంగానే చెబుతున్నారు. దేవాలయ నిధులు దుర్వినియోగం కావడం లేదు...అక్రమాలు జరగడం లేదు..అవినీతి తగ్గిపోయింది. పరిపాలనా వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చి...సమర్థులను ఏరికోరి..వారికి కీలక బాధ్యతలు అప్పచెప్పిన ఘనత ఇఒదే. ప్రస్తుతం దుర్గగుడి ఇఒగా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి పేరు 'సూర్యకుమారి'. ఆమె ఒక కులానికి చెందిన వారిని అవమానిస్తున్నారంటూ..వారిని లెక్క చేయడం లేదంటూ దుష్రృచారం జరిగింది. తనకు కులాభిమానం లేదు..ఏ కులంపై వ్యతిరేకత లేదు..ఇంతకు ముందు తాను అనేక శాఖల్లో బాధ్యతలు నిర్వహించాను..ఆ వివరాలు తెలుసుకుని తాను అటువంటి అధికారినైతే..ఆధారాలు చూపండి...ప్రతి విషయాన్ని కులంతో ముడిపెట్టడం సరికాదు..నాపై ఎన్ని ఆరోపణలు విమర్శలు చేసినా..అమ్మవారే చూసుకుంటారు..తాను తప్పులు చేస్తే..ఆమే తనను శిక్షిస్తారని...ఇదిగో..ఆమెను బదిలీ చేస్తున్నారు..అదుగో ఆమెను బదిలీ చేస్తున్నారని జరుగుతున్న ప్రచారం ఇంత వరకు వాస్తవం కాలేదు. ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబును తప్ప..దేవాదాయశాఖమంత్రిని కలసి వాస్తవాలను వివరించారు. దుర్గగుడిపై ఏం జరిగిందో ఏమిటో..అనేది నిజనిర్ధారణ కమిటీ తేలుస్తుందని, తరువాత దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని కొందరు నాయకులతో పాటు ఎమ్మెల్సీ బుద్దావెంకన్న చెబుతున్నారు. ఒక్క విషయం మాత్రం యధార్థం...ఆమె రాజకీయవర్గాల ఒత్తిడికి తలవొగ్గ లేదు. దుర్గగుడి నిధులు దుర్వినియోగం కాకుండా..గతంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై మళ్లీ పునరావృతం కాకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. కొంత మంది ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకులైన రిటైర్డ్‌ అధికారులు, సీనియర్‌ అధికారుల మాట ఆమె వింటున్నారని, జరిగిన ప్రచారంపై 'సూర్యకుమారి' స్పందిస్తూ...తాను..ఐఎఎస్‌ అధికారిగా తన బాధ్యతను నిర్వహిస్తున్నానే తప్ప..ఎవరో ఏదో ప్రచారం చేశారనే విషయాన్ని నమ్మవద్దు..తాను కులాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై నమ్మకంతో ఇఒగా నియమించారు..ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా...బాధ్యతలు నిర్వహిస్తున్నాను..ఏదైనా తప్పుడు పనులు చేసి ఉంటే ముఖ్యమంత్రి చర్యలు తీసుకునేవారు కదా...ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే..తాను ఎటువంటి తప్పు చేయలేదనే కదా..! తనను ఇఒగా బదిలీ చేయాలా..వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం. ఇంతకు ముందే తనను బదిలీ చేస్తారని ప్రచారం చేశారు. దురదృష్టవశాత్తు...ఆ సంఘటన జరగడం వల్ల కొంత ఆవేదన కలిగించింది తప్ప..ఐఎఎస్‌ అధికారిగా ఎక్కడ నియమించినా..అక్కడ బాధ్యతలు నిర్వహిస్తాను..కానీ..బదిలీ చేయమని కానీ..ముందు ముందు అడగనని ఆమె మీడియా వర్గాలకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

(313)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ