WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సచివాలయ క్యాంటీన్‌కు సబ్సీడీ నిధులను విడుదల చేసిన ప్రభుత్వం

సచివాలయంలో ఉద్యోగవర్గాలు నిర్వహిస్తున్న కోపరేటివ్‌క్యాంటీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మొదట విడతగా 6,07,748/- సబ్సీడీ సొమ్మును విడుదల చేసింది. క్యాంటీన్‌లో సచివాలయ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది, మీడియా సిబ్బంది, ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులకు 50శాతం సబ్సీడీపై భోజనం మరియు టిఫిన్లు సరఫరా చేస్తున్నారు. గత ఏడాది నవంబర్‌ నుంచి డిసెంబర్‌ 14 వరకు 41,128 టోకెన్లకు సబ్సీడీ సొమ్మును మంజూరు చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఎనిమిది లక్షల సొమ్మును అడ్వాన్స్‌గా నిర్వాహకులకు మంజూరు చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారపదార్థాలు క్యాంటీన్‌లో లభిస్తున్నాయని కేవలం రూ.25/-లతో భోజనం, అందులో పలురకాల కాయకూరలు,పచ్చడితో పాటు, పెరుగును కూడా ఇస్తున్నారు. టిఫన్లు కూడా రుచిగా ఉంటున్నాయని, తాజాగా చైనీస్‌ వంటకాన్ని ఒక దాన్ని ఇటీవల ప్రవేశపెట్టారు. క్యాంటీన్‌ భోజనాలు, టిఫన్లు రుచికరంగా,శుభ్రంగా ఉంటున్నాయని సచివాలయ ఉద్యోగులు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది, మీడియా వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

 క్యాంటీన్‌ను నిర్వహిస్తున్న కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులు ఓర్పుతో..నేర్పుతో వ్యవహరిస్తూ...ఎటువంటి వివాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతలను పర్యవేక్షిస్తున్న సూపర్‌వైజర్‌తో పాటు ఇతరులు కూడా బాధ్యతగా ఉంటున్నారని ఆ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఒక్కొక్క రోజు వండిన పదార్ధాలు మిగిలిపోయి నష్టం వస్తున్నా...ఎవరికి ఎటువంటి లోటు రాకుండా..సాయంత్రం 6.30గం.ల వరకు వివిధ రకాల టిఫన్లను వేడిగా సరఫరా చేస్తున్నారు. ఇంతకు ముందు వంటగదిలో ప్రమాదం జరిగి లక్షల రూపాయలు నష్టం జరిగింది. ఈ క్యాంటీన్‌ నిర్వహకులు వాస్తవాలను ప్రభుత్వదృష్టికి, జిఎడి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సచివాయల క్యాంటీన్‌లో సరఫరా చేస్తున్న భోజనం కానీ..టిఫిన్లుకు వంకలు పెట్టలేమని, పరిశుభ్రంగా, రుచికరంగా ఉంటున్నాయని, భోజనానికి క్వాలిటీ బియ్యాన్ని వాడుతున్నారని, ఎవరైనా ఎప్పుడైనా పరీక్షించుకోవచ్చని, ఇంత వరకు ఈ విషయంపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని క్యాంటీన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ మీడియా వర్గాలకు తెలిపారు.


(288)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ