లేటెస్ట్

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ కుమార్ జైన్

భారత ప్రభుత్వం కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులను మేరకు  దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందిన అరుణ్ కుమార్ జైన్ ఈరోజు పదవీ బాద్యతలను స్వీకరించారు   అరుణ్ కుమార్ జైన్   ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ (ఐ ఆర్ ఎస్ ఎస్ఏ ఈ)  1986  బ్యాచ్ కి చెందినవారు. దక్షిణ మధ్య రైల్వే లో  ఆయన ఇంచార్జి జనరల్ మేనేజర్ గా , అదనపు జనరల్ మేనేజర్ గా ,  ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికం ఇంజనీర్ గా  , హైదరాబాద్ డివిజన్ డివిజినల్ మేనేజర్  గా విధులు నిర్వహించారు. DRM గా  బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఆయన డివిజన్ లోని వివిధ రైల్వే స్టేషన్ లలో ప్రయాణికుల కోసం వసతులను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సమయంలో భద్రత ,పారిరిరక్షణ మరియు పరివర్తన రంగాలలో  నాలుగు అత్యంత ప్రతిభా సామర్థ్య అవార్డులను డివిజన్ సాధించింది . ఐఎన్ఎస్ఈపడి, సింగపూర్, ఐసిఎఐఎఫ్, మలేషియా, ISB హైదరాబాద్. SDA  బొకోని ,మిలన్ లలో  మేనేజ్మెంట్ శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశారు.అరుణ్ కుమార్ జైన్ గోరఖ్ పూర్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్  నుండి బ్యాచిలర్ డిగ్రీని మరియు  ఖరగపూర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ ఇంజినీరింగ్ మాస్టర్ డిగ్రీ పొందారు.

భారతీయ రైల్స్ లో అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్మునికేషన్ ఇంజినీర్ గా   ఉద్యోగ బాధ్యతలను ప్రారంభించిన ఆయన  దశాబ్దాల సర్వీసులో  ఉత్తర మరియు  మధ్య రైల్వే  మరియు దక్షిణ మధ్య రైల్వేల్లో పలు కీలక బాధ్యతలలో  విధులు నిర్వహించారు. ఈయన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్  డి ఎస్ ఓ )లో కూడా బాధ్యతలు నిర్వహించారు  మరియు డిజిటల్ యాక్సిల్ కౌంటర్స్,  సాలిడ్ స్టేట్ బ్లాక్ ,  ట్రైన్ ప్రొటెక్షన్ అండ్ వార్నింగ్ సిస్టమ్ (టిపిడబ్లూఎస్) , ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టి కాస్ ) వంటి అడ్వాన్స్డ్ సిగ్నలింగ్ సిస్టమ్స్ లో కీలక బాధ్యతలు పోషించారు. ఈయన రైల్ టెల్ కార్పొరేషన్ అఫ్  ఇండియా లిమిటెడ్ లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా & గ్రూప్ జనరల్   మేనేజర్ గా కుడా అయన  పదవీ బాధ్యతలు నిర్వహించారు.దక్షిణ మధ్య రైల్వే  జనరల్ మేనేజర్ (ఇన్-ఛార్జి)గా పనిచేసిన కాలంలో, సికింద్రాబాద్ డివిజన్ లోని   సికింద్రాబాద్ - కాజీపేట - బల్హర్షా, కాజీపేట - కొండపల్లి  ,   విజయవాడ డివిజన్‌లోని గూడూరు, రేణిగుంట – గుంతకల్ – గుంతకల్ డివిజన్‌లోని వాడి  సెక్షన్ తో సహా  దక్షిణ మధ్య రైల్వే  మొత్తం హై-డెన్సిటీ   మార్గంలో     గరిష్టంగా   130 కి.మీ.ల  వేగాన్ని సాధించడంలో జోన్ గణనీయమైన వృద్ధిని   సాధించింది. స్వర్ణ చతుర్భుజి తదితర అత్యధిక ట్రాఫిక్ సాంద్రత గల మార్గాలలో గరిష్ట వేగం సాధించింది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ